Akasa Air: త్వరలోనే గగనంలోకి ఆకాశ ఎయిర్ విమానాలు.. రాకేష్ ఝున్ ఝున్ వాలా ప్రకటన..

Akasa Air: దేశవ్యాప్తంగా విమాన సేవలు అందించేందుకు మరో కొత్త సంస్థ అందుబాటులోకి వచ్చింది. స్టాక్‌మార్కెట్ ఇన్వేస్టర్ రాకేష్ ఝున్ ఝున్ వాలా .. ఆకాశ ఎయిర్ ఆగస్టు 7నుంచి తమ కార్యకలాపాలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. తమ తొలి సర్వీసును ముంబయి-అహ్మదాబాద్ మధ్య నడపనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఇప్పటికే టికెట్ బుకింగ్‌లు ప్రారంభించినట్లు తెలిపింది.
ఆగస్టు 13 నుంచి బెంగళూరు-కొచ్చి మధ్య కూడా సేవలు ప్రారంభిస్తామని తెలిపింది ఆకాశ ఎయిర్. దీనికి కూడా టికెట్లు ఇప్పటి నుంచే బుక్ చేసుకోవచ్చని పేర్కొంది. రెండు బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలతో తమ వాణిజ్య కార్యకలాపాలకు కంపెనీ శ్రీకారం చుట్టనుంది. ఇప్పటికే ఒక విమానం భారత్‌కు చేరుకుంది. మరొకటి ఈ నెలాఖరు వరకు కంపెనీ చేతికి అందనుంది.
దశలవారీగా ఇతర నగరాలకు కూడా తమ కార్యకలాపాలను విస్తరిస్తామని తెలిపింది. విమానయాన నియంత్రణా సంస్థ డీజీసీఏ నుంచి ఈ నెల 7న ఆకాశ ఎయిర్ ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికెట్ అందుకుంది. మొత్తం 72 మ్యాక్స్ విమానాల కోసం కంపెనీ గత ఏడాది నవంబరులో బోయింగ్‌తో కొనుగోలు ఒప్పందం కుదుర్చుకొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com