ఆస్తుల్లో కొత్త రికార్డు.. బిల్ గేట్స్ ను దాటిన మస్క్

టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ తాజాగా మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌ను అధిగమించారు. ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానానికి ఎగబాకారు. ఎలాన్ సంపద 7.2 బిలియన్ డాలర్లు పెరిగి ఏకంగా 127.9 బిలియన్ డాలర్లకు చేరింది. 127.7 బిలియన్ డాలర్లతో ఉన్న మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ను దాటారు. ఇటీవల గత వారం ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌ను కూడా దాటేశారు. ఈ ఏడాది ప్రారంభంలో 35 వ స్థానంలో మస్క్ ఏకంగా రెండో స్థానానికి రావడం విశేషం. మస్క్ సంపద ఏడాదిలో 100.3 బిలియన్ డాలర్లు పెరిగింది. బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం ఎలాన్ మస్క్ ఇతర బిలియనీర్ల కంటే ఈ ఏడాది ఎక్కువగా ఆర్జించారు. కొద్ది నెలల క్రితమే టాప్ 10 లోకి వచ్చి ఇప్పుడు ఏకంగా టాప్ 2కి వచ్చాడు. టెస్లా రాణించడంతో పాటు స్పేస్ఎక్స్ వ్యామోగాములను విజయవంతంగా అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. దీంతో అతని సంపద అమాంతం పెరిగింది. ఈ కంపెనీ మార్కెట్ వ్యాల్యూ 500 బిలియన్ డాలర్లను తాకింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com