ALERT: సెకండ్ హ్యాండ్ వాహనాలతో పారాహుషార్

ALERT: సెకండ్ హ్యాండ్ వాహనాలతో పారాహుషార్
X
ఢిల్లీ పేలుడులో ఓనర్ కొంపముంచిన కారు... రిజిస్ట్రేషన్ చేయించకుండానే అమ్మకం... వాహనాలు కొనేటప్పుడు జాగ్రత్త

ఎర్ర­కోట సమీ­పం­లో సో­మ­వా­రం సా­యం­త్రం జరి­గిన కారు పే­లు­డు ఘటన యా­వ­త్ దే­శా­న్ని ది­గ్భ్రాం­తి­కి గు­రి­చే­సిం­ది. ఈ ఘటన దేశ రా­జ­ధా­ని భద్ర­త­పై తీ­వ్ర ప్ర­శ్న­లు లే­వ­నె­త్త­డ­మే కా­కుం­డా దర్యా­ప్తు సం­స్థ­ల­కు ఓ చి­క్కు­ము­డి­ని వి­సి­రిం­ది. ప్రా­థ­మిక దర్యా­ప్తు­లో భా­గం­గా పే­లు­డు సం­భ­విం­చిన తె­లు­పు ఐ20 కారు.. కే­వ­లం ఓ సం­వ­త్స­రం­లో­నే ఏడు­గు­రి చే­తు­లు మా­రి­నా, రి­కా­ర్డు­ల్లో మా­త్రం యజ­మా­ని పేరు మా­ర­లే­ద­ని తే­లిం­ది. ఈ కారే ఇప్పు­డు ఉగ్ర­వాద కు­ట్ర­లో అత్యంత కీ­ల­క­మైన ఆధా­రం­గా మా­రిం­ది. HR26CE7674 నం­బ­ర్ గల ఈ కారు 2013లో తయా­రు చే­య­బ­డి 2014లో గు­రు­గ్రా­మ్‌­కు చెం­దిన సల్మా­న్ పే­రు­పై రి­జి­స్ట­ర్ అయ్యి ఉంది. పే­లు­డు­కు సం­బం­ధిం­చిన అన్ని పత్రా­ల­లో ఇప్ప­టి­కీ సల్మా­న్ పేరే ఉంది. సల్మా­న్‌­ను వి­చా­రిం­చ­గా.. అతను ఈ కా­రు­ను ఓఖ్లా ని­వా­సి దే­వేం­ద్ర­కు అమ్మి­న­ట్లు తె­లి­పా­డు. దే­వేం­ద్ర దా­ని­ని అం­బా­లా­కు చెం­దిన వ్య­క్తి­కి, ఆ తర్వాత పు­ల్వా­మా­కు చెం­దిన ఆమి­ర్‌­కు వి­క్ర­యిం­చా­రు. ఆమి­ర్ నుం­చి ఈ కారు ఫరీ­దా­బా­ద్‌­లో­ని అల్-ఫలా­హ్ వి­శ్వ­వి­ద్యా­ల­యం­లో పని­చే­స్తు­న్న డా­క్ట­ర్ ము­జ­మ్మి­ల్ షకీ­ల్ చే­తి­కి చి­వ­ర­కు డా­క్ట­ర్ ఉమర్ మహ­మ్మ­ద్ వరకు చే­రిం­ది. దర్యా­ప్తు సం­స్థ­ల­కు అం­దిన సమా­చా­రం ప్ర­కా­రం.. ఈ కారు కనీ­సం ఏడు­గు­రి చే­తు­లు మా­రి­నా రి­జి­స్ట్రే­ష­న్ మా­త్రం సల్మా­న్ పే­రు­పై­నే ఉంది. పన్ను­లు, ఇతర పే­ప­ర్ వర్క్ నుం­చి తప్పిం­చు­కు­నేం­దు­కు సె­కం­డ్ హ్యాం­డ్ వా­హ­నా­ల­ను కొ­ను­గో­లు చే­సే­వా­రు రి­జి­స్ట్రే­ష­న్ బది­లీ చే­య­క­పో­వ­డం మొ­ద­టి ఓన­రు­కు చాలా ఇబ్బం­దు­లే తె­చ్చి పె­ట్టిం­ది.

మీరు ఈ తప్పులు చేయకండి

అం­దు­కే సె­కం­డ్ హ్యాం­డ్ వా­హ­నా­లు కొనే ముం­దు, అమ్మే ముం­దు కొ­న్ని జా­గ్ర­త్త­లు తప్ప­ని­స­రి. లే­క­పో­తే ఢి­ల్లీ పే­లు­ళ్ల లాం­టి ఉదం­తా­ల­లో మీరు చి­క్కు­కు­పో­వ­డం లేదా ఇతర సమ­స్య­ల్లో ఇరు­క్కు­నే ప్ర­మా­ద­ముం­ది. మొ­ద­ట­గా వా­హ­నం రి­జి­స్ట్రే­ష­న్ సర్టి­ఫి­కె­ట్ ఖచ్చి­తం­గా తని­ఖీ చే­యా­లి. ఆ ఆర్‌­సి జె­న్యూ­న్‌­దా, యజ­మా­ని వి­వ­రా­లు సరై­న­వే­నా చూ­డా­లి. కొం­త­మం­ది వా­హ­నం­పై ఉన్న పాత చలా­న్ల­ను, పెం­డిం­గ్ కే­సు­ల­ను బయ­ట­పె­ట్ట­కుం­డా వా­హ­నం అమ్మే ప్ర­య­త్నం చే­స్తా­రు. కా­బ­ట్టి e-challan వె­బ్‌­సై­ట్‌­లో వా­హ­నం నం­బ­ర్ నమో­దు చేసి చలా­న్లు ఉన్నా­యా లేదో పరి­శీ­లిం­చా­లి. వీ­టి­తో పాటు వా­హ­నం ఇన్సూ­రె­న్స్ పా­ల­సీ చూ­సు­కో­వా­లి. చె­ల్లు­బా­టు­లో ఉన్న పా­ల­సీ ఉంటే ప్ర­మా­దం జరి­గి­న­ప్పు­డు కవ­రే­జీ లభి­స్తుం­ది. పాత బై­క్‌­కి ఇది చాలా ము­ఖ్యం. అలా­గే కా­లు­ష్య ని­యం­త్రణ సర్టి­ఫి­కే­ట్ కూడా తప్ప­ని­స­రి. ఇది వా­హ­నం కా­లు­ష్య ప్ర­మా­ణా­ల­కు అను­గు­ణం­గా ఉం­ద­ని ని­ర్ధా­రి­స్తుం­ది.

ఇది అంత్యంత ముఖ్యమైనది

వా­హ­నం చా­సి­స్ నం­బ­ర్ తని­ఖీ చే­యా­లి. ఆర్‌­సీ­పై చా­సి­స్ నం­బ­ర్‌­కి వా­హ­నం­పై ఉన్న­ది సరి­పో­తుం­దా అనే వి­ష­యం­లో జా­గ్ర­త్త­గా చూ­డా­లి. పత్రా­లు అన్ని ఒరి­జి­న­ల్‌­గా ఉన్నా­యా? నకి­లీ ఆర్ సీ తీ­సు­కు­వ­చ్చి తప్పు­డు వా­హ­నా­లు అమ్మే వారు కూడా ఉం­టా­ర­ని ట్రా­ఫి­క్ పో­లీ­సు­లు హె­చ్చ­రి­స్తు­న్నా­రు. ఇంకా 15 ఏళ్లు దా­టిన వా­హ­నా­ల­ను కొం­ద­రు తు­క్కు చే­యా­ల్సిం­ది అని తె­లి­సీ ఎలా­గో­లా అమ్మే ప్ర­య­త్నం చే­స్తా­రు. వా­హ­నం రి­జి­స్ట్రే­ష­న్ ఎప్పు­డు అయిం­దో స్ప­ష్టం­గా చూసి తర్వా­తే కొ­నా­లి. వా­హ­నం ఇతర ప్రాం­తం­లో రి­జి­స్ట­ర్ అయి ఉండి అక్క­డి నుం­డి మీ జి­ల్లా కేం­ద్రా­ని­కి మా­రి­తే నో ఆబ్జె­క్ష­న్ సర్టి­ఫి­కే­ట్ తప్ప­ని­స­రి­గా తీ­సు­కో­వా­లి. చి­న్న పొ­ర­పా­టు­తో వా­హ­నం కొ­ను­గో­లు తర్వాత సమ­స్య­ల్లో పడ­కుం­డా, ఆర్థిక నష్టం పొం­ద­కుం­డా జా­గ్ర­త్త­ తప్ప­ని­స­రి­గా పా­టిం­చ­మ­ని ట్రా­ఫి­క్ పో­లీ­సు­లు సలహా ఇస్తు­న్నా­రు.

Tags

Next Story