అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే ఆఫర్ల వెల్లువ.. ఐఫోన్ 12 మినీ..

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ కస్టమర్లను ఆకర్షించడానికి, సేల్స్ పెంచుకునేందుకు వచ్చిన ప్రతి సందర్భాన్ని వంద శాతం ఉపయోగించుకుంటుంది. ఆఫర్లను ప్రకటిస్తూ కొనుగోలుదారులను ఆకట్టుకుంటుంది. జనవరి వచ్చిందంటే 26న వచ్చే రిపబ్లిక్ డే అమెజాన్ కస్టమర్లకు పండగే పండగ. గ్రేట్ రిపబ్లిక్ డే పేరుతో జనవరి 20వ తేదీ నుండి జనవరి 23వ తేదీ వరకు నిర్వహించనుంది అమెజాన్. ఈ సేల్‌లో ఐఫోన్ 12 మినీ, వన్ ప్లస్ 8టి, రెడ్‌మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ మరియు అన్ని స్మార్ట్ ఫోన్లపై తగ్గింపును అందిస్తోంది అమెజాన్.
ఇక ఎస్‌బిఐ క్రెడిట్ కార్డుతో 10% తక్షణ తగ్గింపు కూడా అందిస్తోంది. ఇకపోతే ప్రైమ్ సభ్యుల కోసం మరింత ముందుగానే అంటే జనవరి 19వ తేదీన ఈ సేల్ అందుబాటులోకి వస్తుంది. అమ్మకాలు ఏ సమయంలో ప్రారంభిస్తారనే అమెజాన్ ఇంకా పేర్కొనలేదు. అమెజాన్ ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ ఫోన్లు, గృహోపకరణాలు, ఫ్యాషన్ వేర్‌తో పాటు మరిన్ని ఉత్పత్తులతో వివిధ వర్గాల వారికి డిస్కౌంట్‌ను అందిస్తూ సేల్స్ నిర్వహించనుంది. ఈ సేల్ ద్వారా డిస్కౌంట్‌లో వచ్చే ఫోన్‌లు.. ఐఫోన్ 12 మినీ, వన్‌ప్లస్ 8టి, శామ్‌సంగ్ గెలాక్సీ ఎం 51, రెడ్‌మి నోట్ 9 ప్రొ మాక్స్, మరియు నోకియా 5.3, శాంసంగ్ గెలాక్సీ ఎం 31 ప్రైమ్‌లు ఉంటాయని కంపెనీ ఇప్పటికే స్పష్టం చేసింది. కాగా, ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారనేది కంపెనీ ఇంకా ప్రకటించలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com