Amazon: అమెజాన్ మరో ఈస్టిండియా కంపెనీ.. ఇండియాను దోచేస్తోంది: RSS సంచలన వ్యాఖ్యలు

Amazon: అమెజాన్ మరో ఈస్టిండియా కంపెనీ.. ఇండియాను దోచేస్తోంది:  RSS సంచలన వ్యాఖ్యలు
200 ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన ఈస్టిండియా కంపెనీని తరిమికొడితే మళ్లీ అమెజాన్ రూపంలో ఈస్టిండియా 2.0 వస్తుందని ఆరోపించింది.

Amazon: ఇండియాలో భవిష్యత్తు అంతా అమెరికా కంపెనీలదేనా?దేశంలో మరో ఈస్టిండియా కంపెనీ ప్రవేశించిందా..? వందకు వంద శాతం ఇదే నిజమంటోంది RSS. గత కొంతకాలంగా కార్పొరేట్‌ కంపెనీలను టార్గెట్‌ చేస్తున్న బీజేపీ సైద్దాంతిక సంస్థ RSS తాజాగా తన అనుబంధ పత్రిక పాంచజన్యంలో అమెజాన్‌పై నిప్పులు చెరిగింది. 200 ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన ఈస్టిండియా కంపెనీ తరిమికొడితే మళ్లీ అమెజాన్ రూపంలో ఈస్టిండియా 2.0 వస్తుందని ఆరోపించింది. దేశంలో వ్యాపారాన్ని తన ఆధీనంలో పెట్టుకుని గుత్తాధిపత్యాన్ని చెలాయించాలని అమెజాన్‌ చూస్తోందని వ్యాఖ్యానించింది. తన వ్యాపారం పెంచుకోవడానికి అనుకూల విధానాల కోసం ఏకంగా లంచాలు కూడా ఇచ్చినట్టు అందులో పేర్కొంది. సంచలన ఆరోపణలు...

2018-20 మధ్య అమెజాన్‌ తన లీగల్‌ టీంకు 1.2 బిలియన్‌ డాలర్లు అంటే రూ.8546 కోట్లు ఇచ్చినట్లు పాంచజన్యం పత్రిక కథనం రాసింది. ఇవన్నీ దేశంలో లంచాల రూపంలో ఖర్చు చేయడంతో పాటు లీగల్ ఖర్చలుకు వాడిందని ఆరోపించింది. రిలయన్స్ కంపెనీ ఇటీవల నష్టాల్లో ఉన్న ఫ్యూచర్‌ గ్రూప్‌ను సొంతం చేసుకుంది. 23వేల కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అయితే తనకున్న వాటాలను అడ్డుపెట్టుకని మరీ దేశీయ సంస్థల మధ్య డీల్‌ పై కోర్టుకు వెళ్లింది. దీంతో లీగల్ సమస్యల కారణంగా అడ్డుకట్ట పడింది.

పాంచజన్యం ఉద్దేశం ప్రకారం రిలయన్స్‌, టాటా వంటి సంస్థల ఆధిపత్యాన్ని అడ్డుకుని... తమ చేతిలోకి వ్యాపారాలను తీసుకోవాలన్నది సంస్థ ప్రయత్నం. ముందు కంపెనీలపై ఆధిపత్యం సాధించి.. తర్వాత ప్రజల డేటా సేకరించి వారిపై పెత్తనం చేసే విధంగా అమెజాన్‌ తయారువుతుందని.. ఇది వందశాతం ఈస్టిండియా కంపెనీ 2.0 అంటోంది RSS పత్రిక. చాలా కంపెనీల్లో ఇప్పటికే భారీగా పెట్టుబడులు పెట్టిందని.. చిన్న చిన్న కంపెనీల్లో రహస్య పెట్టుబడులు కూడా ఉన్నాయంటోంది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు విరుద్దంగా ప్రైమ్‌లో వీడియోలూ, పాశ్చాత్య సంస్క్రుతి నిండిన సినిమాలు ప్రదర్శిస్తోంది. ఇది ఓ రకంగా దేశంపై దాడే అంటోంది.

మొత్తానికి పాంచజన్యం అక్టోబర్ 3 ఎడిషన్లో రాసిన కథనం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంతకుముందు ఎడిషన్లో కూడా ఇది Infosys తీరును తప్పబట్టింది. రాజకీయంగా దేశంలో కుట్ర జరుగుతుందని.. పన్నుల కు సంబంధించి వెబ్‌ సైట్‌లో టెక్నికల్‌ సమస్యల వెనక ఏదో కుట్ర ఉందన్న అనుమానం వ్యక్తం చేసింది. ఇన్ ఫోసిస్ కంపెనీలో అంతా కమ్యూనిస్టులు.. కాంగ్రెస్ పార్టీ అనుకూల వర్గాలున్నాయి.. ఉద్ధేశపూర్వంగానే దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికి కుట్రలు పన్నారని ఆరోపించింది. అయితే ఈ వ్యాఖ్యల పట్ల ప్రభుత్వం దూరంగా ఉంది. RSS కథనంలో ప్రభుత్వానికి సంబంధం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. తాజాగా ఝున్ ఝన్ వాలా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది చూడాలి.

Also Read:

Tags

Read MoreRead Less
Next Story