అమెజాన్ బిగ్ ప్లాన్స్..! ఇండియా మొత్తం దున్నేసే వ్యూహం !

అమెజాన్ బిగ్ ప్లాన్స్..! ఇండియా మొత్తం దున్నేసే వ్యూహం !
ఈ కామర్స్ టెక్ జెయింట్ అమెజాన్, మెల్లగా భారత్‌లోని ఓ రంగాన్ని వదిలిపెట్టకూడదని డిసైడైనట్లు కన్పిస్తోంది.

ఈ కామర్స్ టెక్ జెయింట్ అమెజాన్, మెల్లగా భారత్‌లోని ఓ రంగాన్ని వదిలిపెట్టకూడదని డిసైడైనట్లు కన్పిస్తోంది. ఇప్పటికే ఈ కామర్స్ రంగంతో పాటు వెబ్ సర్వీస్ రంగంలో డేటాసెంటర్లను ఏర్పాటు చేస్తోన్న అమెజాన్, తొందర్లోనే ఇన్సూరెన్స్ పేమెంట్స్, క్రెడిట్ కార్డ్స్‌తో పాటు పేమెంట్స్ యాప్స్ కూడా తీసుకువచ్చే వ్యూహం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే అమెజాన్‌పే పేరుతో ఓ యాప్ బేస్డ్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్న అమెజాన్, అసలు తనంతట తానే ఓ పేమెంట్ సొల్యూషన్స్ తెస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనతో ముందుకు కదులుతోందట.

వాల్‌మార్ట్‌కి ఫోన్‌పే, ఆలీబాబాకి పేటిఎం, గూగుల్‌కి గూగుల్‌ పే ఉన్నాయ్. మరి ఈ కామర్స్ జెయింట్ అయిన తనకి మాత్రం ఎందుకు పేమెంట్ సొల్యూషన్స్ ఉండకూడదన్నదే ఈ ఆలోచనకి ప్రేరణ, పైగా ఇండియాలో డిజిటల్ పేమెంట్స్ వ్యాపారం భారీగా ఉంది. దీంతో ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్‌కి పేమెంట్ చేయడం, క్రెడిట్ కార్డ్ సర్వీస్ ప్రారంభించడం సహా అనేకరకాల ఫైనాన్షియల్ సర్వీసులపై అమెజాన్ కన్నేసింది

అమెజాన్‌ని ఊరిస్తున్నదేంటి?

దేశంలో 340 బిలియన్ డాలర్ల ఫైనాన్షియల్ సర్వీస్ మార్కెట్

85శాతం క్యాష్ ఎర్నింగ్స్

ప్రతి 4 ట్రాన్సాక్షన్స్‌లో ఒకటి ఫెయిల్

లక్ష కోట్ల డాలర్ల పేమెంట్ బిజినెస్

రాబోయే రెండేళ్లలోనే ఇండియాలోని డిజిటల్ పేమెంట్ బిజినెస్ ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటాయని అంచనా. ఇంత స్పేస్ ఉన్న ఈ రంగాన్ని ఇన్నాళ్లూ తక్కువగా చూసాయనుకున్నాయేమో కానీ, వాట్సాప్ ఇప్పటికే లాంచ్ చేసింది. ఇప్పుడు అమెజాన్ కూడా పేమెంట్ యాప్ తెస్తే ఇక పోటీ మరింత పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాదు దేశంలో 85శాతం మంది క్యాష్ లావాదేవీలకు అలవాటు పడి ఉన్నారు, కేవలం 2-3శాతం మంది మాత్రమే క్రెడిట్ కార్డ్స్ వాడుతున్నారు.

భవిష్యత్తులో క్రెడిట్ కార్డ్స్ యూసేజ్‌ని కూడా పెంచగలిగితే వ్యాపారం ఇంకా పెరుగుతుందని అమెజాన్ భావిస్తోంది. సరైన పేమెంట్ సర్వీస్, అలానే కార్డ్ ట్రాన్సాక్షన్స్‌లో ఫెయిల్యూర్స్‌కి అడ్డుకట్ట వేయాలంటే, తమకే ప్రత్యేకంగా ఓ ప్లాట్‌ఫామ్ ఉంటే కస్టమర్లు ఈజీగా తమవైపు మళ్లుతారనేది అమెజాన్ స్కెచ్ అందుకే అమెజాన్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌కంటూ తమకే ఓ స్పెషల్ ప్లాట్‌ఫామ్ తయారు చేసుకోబోతోందని అమెజాన్ ఇండియా సీఈఓ మహేంద్ర నెరూర్కర్ చెప్పారు. సో రాబోయే రెండేళ్లలో ఇక అమెజాన్ కార్డులు, అమెజాన్ పేమెంట్ సర్వీసులు వాడకం చూడబోతున్నామన్నమాట!

Tags

Read MoreRead Less
Next Story