Amazon Prime: అలెర్ట్.. అమెజాన్ ప్రైమ్ పాత యూజర్లకు లాస్ట్ ఛాన్స్..

Amazon Prime (tv5news.in)
Amazon Prime: టెక్నాలజీ లవర్స్‌ను ఇంప్రెస్ చేయాలంటే ఎప్పటికప్పుడు ఆఫర్స్‌తో వారిని ఆకర్షించాలి. అలా ఆకర్షించిన తర్వాత మెల్లగా వారి బిజినెస్‌లో లాభాలు తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. ప్రస్తుతం చాలావరకు వ్యాపారవేత్తలు ఉపయోగిస్తున్న స్ట్రాటజీ ఇదే. ఇప్పుడు ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ కూడా ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతోంది. అదే అమెజాన్ ప్రైమ్.
ప్రస్తుతం ఎంటర్‌టైన్మెంట్ లవర్స్‌కు చాలా దగ్గరయిపోయింది ఓటీటీ. అందులోనూ స్క్రీన్స్‌కు లిమిట్ లేకుండా ఎంతమంది అయినా ఉపయోగించుకోగల అమెజాన్ ప్రైమ్ అకౌంట్‌ను చాలామందే ఉపయోగిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్.. ఓటీటీలాగానే కాకుండా షాపింగ్ విషయంలో కూడా వినియోగదారులకు ఖర్చు తగ్గిస్తుంది. ప్రైమ్ అకౌంట్ ఉన్నవారు అమేజాన్‌లో షాపింగ్ చేసేటప్పుడు వారికి ప్రత్యేకమైన ఆఫర్లు కూడా ఉంటాయి. అయితే ఇప్పటివరకు వినియోగదారులకు అందుతున్న సౌకర్యాలు ఈరోజుతో ముగియనున్నాయి.
సంవత్సరం మొత్తం అమెజాన్ ప్రైమ్ ప్లాన్ కోసం ఇంతకు ముందు రూ.999 చెల్లించాల్సి ఉండేది. డిసెంబర్ 14 నుండి ఆ ధర రూ.1499కు పెరగనుంది. నెల రోజుల సబ్‌స్క్రిప్షన్ కోసం రూ.129 చెల్లించేవారు కానీ అది రూ.179కు పెరిగింది. ఇక మూడు నెలల సబ్‌స్క్రిప్షన్ ధర రూ. 329 నుండి రూ. 459కు పెరిగింది. ఇక అమెజాన్ ప్రైమ్ పాత ధరలకు ఇదే చివరిరోజు కావడంతో వినియోగదారులు సబ్‌స్క్రిప్షన్లను రెన్యువల్ చేసే పనిలో పడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com