Amazon Prime: అమెజాన్ ప్రైమ్ యూజర్లకు గుడ్‌న్యూస్..

Amazon Prime: వచ్చే ఏడాది నుంచి క్రికెట్ లైవ్ స్ట్రీమింగ్ సేవలను అమెజాన్ ప్రైమ్ వీడియోలో పొందవచ్చునని అమెజాన్ ఒక ప్రకటనలో వెల్లడించింది. న్యూజిలాండ్, బంగ్లాదేశ్ మధ్య జరిగే టెస్ట్ సిరీస్ జనవరి 1, 2022 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో లైవ్ స్ట్రీమ్ కానుంది.
నవంబర్ 2020లో, అమెజాన్ ప్రైమ్ వీడియో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు నుంచి లైవ్ స్ట్రీమింగ్ హక్కులను పొందింది. ఈ ఒప్పందంలో భాగంగా న్యూజీలాండ్ ఆడే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు అన్నీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉండనున్నాయి.
ఇకపై ఇండియా మ్యాచ్‌లు కూడా..
ఇప్పటి వరకు స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్ భారత క్రికెట్ మ్యాచ్‌లను అందిస్తోంది. ఇకపై అమెజాన్ ప్రైమ్ కూడా భారత క్రికెట్ మ్యాచ్‌లను లైవ్ స్ట్రీమింగ్ చేయనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ఇండియా న్యూజిలాండ్ మహిళల జట్ల మధ్య జరిగే సిరీస్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియోలో లైవ్ స్ట్రీమ్ కానుంది.
మహిళల క్రికెట్ మ్యాచ్‌లు కూడా స్ట్రీమ్ అవ్వనున్నాయి. వీటితో పాటుగా న్యూజిలాండ్ మెన్స్ జట్టు 2022 ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా పర్యటన, మార్చి 2022లో ఆస్ట్రేలియా పర్యటన, మార్చి/ఏప్రిల్ 2022లో నెదర్లాండ్ పర్యటనలను కూడా అమెజాన్ ప్రైమ్‌లో చూడొచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com