Amul: స్ట్రాలపై నిషేధం, కేంద్రానికి అమూల్ లేఖ

Amul: స్ట్రాలపై నిషేధం, కేంద్రానికి అమూల్ లేఖ

మన దేశంలో 5 నుంచి 30 రూపాయల మధ్య చిన్న ప్యాకుల్లో స్ట్రాల ద్వారా తాగే ఫ్రూటీ, మజా వంటి జ్యూస్‌లు, పాల ఉత్పత్తులు బాగా అమ్ముడుపోతాయి. దేశంలోని ఏ మారుమూల గ్రామం పోయినా, చిన్న దుకాణాల్లోనూ ఇవి దొరుకుతుంటాయి. దేశంలో ఈ ఉత్పత్తుల విలువ 790 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. ప్లాస్టిక్ స్ట్రాలతో వచ్చే ఈ ఉత్పత్తులు ప్రతీ సంవత్సరం 6 కోట్లకు పైగా అమ్ముడుపోతాయని అంచానా.


అయితే జులై 1నుంచి ప్లాస్టిక్ నిషేధించాలన్న విధానంలో భాగంగా కేంద్రప్రభుత్వం ఈ అమ్మకాల్లో ఉపయోగించే స్ట్రాలను కూడా నిషేధించాలని తెలిపింది. దీంతో దేశంలో ప్రముఖమైన పాల ఉత్పత్తుల సంస్థలు, ప్రముఖ బేవరేజిస్ ఉత్పత్తులు అందించే కోకకోలా, పార్లే ఆగ్రో, అమూల్ వంటి సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. పలు విజ్ణప్తుల తర్వాత కూడా ప్రభుత్వం తన నిర్ణయానికే కట్టుబడి ఉంటూ, ప్లాస్టిక్ స్ట్రాలకు బదులు ఇతర ప్రత్యామ్నాయాలు చూసుకోవాలని తెలిపింది.

దేశంలో ప్రముఖ సంస్థ అమూల్ ఈ నిర్ణయంపై ప్రధాని మోదీకి లేఖ రాసినట్లు వెల్లడైంది. ఎంతో మందికి రైతులు, ఇతరులు ఉపాధి పొందుతున్న ఈ రంగంలో ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రత్యామ్నాయాలు చూసుకునే దాకా వచ్చే ఏడాది వరకైనా ఈ నిర్ణయాన్ని వాయిదా వేయాలని కోరింది. ఈ కొద్దిరోజుల వాయిదాతో ఆరోగ్య భద్రతలో కృషి చేస్తున్న 10 కోట్ల మంది రైతులు, పాల ఉత్పత్తులు చేస్తున్న రైతులకు ఆధారపడిన వారికి ఊరటనిస్తుందని కోరింది.


దీనిపై ఇప్పటిదాకా ప్రధాని కార్యాలయం నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. అయితే ఈ విషయంపై అవగాహన అధికారులు మాత్రం నిషేధం తప్పకపోవచ్చని వెల్లడించారు.

బహుళ జాతి సంస్థలైన పెప్సీ ట్రోపికానా, కోకకోలా మజా, పార్లె ఆగ్రోస్ ఫ్రూటీ మ్యాంగో జ్యూస్ వంటివి భారతావనిలో ఎక్కువగా అమ్ముడుపోతుంటాయి. ప్రత్యామ్నాయాలుగా పేపర్‌తో చేసిన ఉత్పత్తులు, బయోడీగ్రేడబుల్ ఉత్పతుత్తులను చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. అయితే వీటి ధరలు 250 శాతం ఎక్కువగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇదే జరిగితే కంపెనీలు చిన్న ప్యాకుల్లో వచ్చే జ్యూస్‌లు, పాల ఉత్పత్తుల ధరలను పెంచకతప్పదు.


Tags

Read MoreRead Less
Next Story