డ్రాగన్‌కు మరో ఝలక్.. చైనా పెట్టుబడులకు చెక్ పెట్టనున్నభారత్

- డ్రాగన్‌కు మరో ఝలక్ ఇవ్వనున్న భారత్?
- ఎల్‌ఐసీ ఐపీఓలో చైనా పెట్టుబడులకే బ్రేక్ పడే ఛాన్స్‌భద్రతాపరమైన కారణాలు చూపుతూ చైనా యాప్స్‌పై నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం.. ఎల్‌ఐసీ ఐపీవో విషయంలోనూ డ్రాగన్‌కు ఝలక్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. త్వరలో రాబోయే ఎల్‌ఐసీ ఐపీవోలో చైనా పెట్టుబడులు రాకుండా అడ్డుకోవాలని కేంద్రం యోచిస్తున్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. అదే సమయంలో ఇతర విదేశీ మదుపర్లు ఐపీవో పాల్గొనేందుకు అనుమతివ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ అనంతరం చైనా పెట్టుబడులను పరిమితం చేసేందుకు భారత్ కొన్ని చర్యలను చేపట్టింది. పలు యాప్స్‌పైనా నిషేధం విధించింది. చైనా నుంచి దిగుమతయ్యే వస్తువులపైనా నిఘా పెంచింది. ఎల్‌ఐసీ ఐపీవోలో సైతం చైనా పెట్టుబడులు పెట్టకుండా అడ్డుకోవాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై ఇంకా తుది నిర్ణయమేదీ తీసుకోలేదని తెలిసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com