iPhone14: 'యాపిల్‌ డేస్‌' యానివర్సరీ సేల్.. ఐఫోన్ 14పై బంపరాఫర్..

iPhone14: యాపిల్‌ డేస్‌ యానివర్సరీ సేల్.. ఐఫోన్ 14పై బంపరాఫర్..
iPhone14: ఎన్ని ఫోన్లు వచ్చినా యాపిల్ ఫోన్ అంటే అదో క్రేజ్. అందని ద్రాక్షలా ఉంటుంది దాని ధర. అందుకే కొనాలన్న కోరికను చంపేసుకుంటారు ఐఫోన్ ప్రియులు.

iPhone14: ఎన్ని ఫోన్లు వచ్చినా యాపిల్ ఫోన్ అంటే అదో క్రేజ్. అందని ద్రాక్షలా ఉంటుంది దాని ధర. అందుకే కొనాలన్న కోరికను చంపేసుకుంటారు ఐఫోన్ ప్రియులు. దాదాపు లక్షకు దగ్గరలో ఉన్న ఐఫోన్ 14 ధర యాపిల్ డేస్ రెండో వార్షికోత్సవం సందర్భంగా రూ.61,900కే సొంతం చేసుకోవచ్చు.



ఎలక్ట్రానిక్స్ విక్రయాల సంస్థ విజయ్ సేల్స్ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో 120కు పైగా రిటైల్ దుకాణాల్లో ఈ ఆఫర్ ఈనెల 31 వరకు పొందవచ్చని తెలిపింది. ఐఫోన్ 14 అసలు ధర రూ.79,900 కాగా, ఆఫర్‌లో రూ.74,900కు అందిస్తున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.5000 తక్షణ రాయితీ లభిస్తుంది.



దాంతో పాటు మీ ఐఫోన్ ఎక్సేంజ్ చేస్తే దానిపై మరో రూ.5000, విజయ్ సేల్స్‌పై మరో రూ.3000 రాయితీ అందిస్తుంది. మొత్తం మినహా రూ.61,900కే ఐఫోన్ 14 పొందొచ్చని సంస్థ వివరించింది. ఇతర ఐఫోన్‌లు, సిరీస్ 8 వాచీ, ఎయిర్ పాడ్స్ ప్రో (రెండో తరం), మ్యాక్‌బుక్‌లు, ఐప్యాడ్స్, వాచీలు, యాపిల్ కేర్+, యాపిల్ యాక్సెసరీస్ పైన కూడా ఆఫర్లు ఉన్నాయి.



రాయితీల అనంతరం ఐఫోన్ 14 ప్రారంభ ధర రూ.69,900, 14+ ప్రారంభ ధర రూ.78,699, ఐఫోన్ 14 ప్రో ప్రారంభ ధర రూ.1,26,100. ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ప్రారంభ ధర రూ.1,35,800, ఐఫోన్ 12 ప్రారంభ ధర రూ.52,900, ఐఫోన్ ధర రూ.62,900 అని సంస్థ తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story