Apple iPhone: ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. భారీ తగ్గింపు

Apple iphone: మార్కెట్లో ఎన్ని ఫోన్‌లు వచ్చినా.. ఐఫోన్ మన దగ్గర ఉంటే ఆ లెవలే వేరప్పా.. కానీ ధర మాత్రం అందరికీ అందుబాటులో ఉండదు.. కొందరికి అందని ద్రాక్షే.. అయితే ఐఫోన్ లవర్స్‌కి ఊరట కలిగించే అంశాన్ని తీసుకొచ్చింది ఫ్లిప్‌కార్ట్. బిగ్ బచత్ ధమాల్ సేల్‌లో ఆపిల్ ఐఫోన్ 12 మినీపై భారీ ఆఫర్ అందిస్తోంది. జులై ఒకటి నుంచి ప్రారంభమైన ఈ సేల్ మరో రెండు రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్రధానంగా ఐఫోన్స్‌పై బెస్ట్ డీల్స్ కొనసాగుతున్నాయి.
ఫ్లిప్‌కార్డ్ బిగ్ బచత్ ధమాల్ సేల్‌లో వినియోగదారులు ఐఫోన్ 12 మినీ రూ.49,999 కే కొనుగోలు చేయవచ్చు. అసలు ధర రూ.59,900. ఐఫోన్ 12 మిని.. 54 అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లే, ఏ14 బయోపనిక్ సాక్, 12 ఎంపీ డ్యూయల్ కెమెరా ప్రధాన ఫీచర్లు. దీంతో పాటు యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై 5 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ 12,500 వరకు ఎక్సేంజ్ డీల్ కూడా ఉంది.
ఐఫోన్ 13 మిని : 128 జీబీ స్టోరేజ్ మోడల్‌పై 7 శాతం తగ్గింపుతో దాదాపు రూ.65,299లకు లభిస్తోంది. గతంలో వెబ్‌సైట్‌లో దీని ధర రూ.69,999. యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ద్వారా అదనంగా మరో 5 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్‌తో పాటు 6 నెలల ఫ్రీ గానా ప్లస్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. నిబంధనల మేరకు ఎక్సేంజ్ ఆఫర్‌తో రూ.12,500 తగ్గుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com