మార్కెట్లో ఆడి కొత్త వెర్షన్.. ధర, ఫీచర్స్ చూస్తే..

మార్కెట్లో ఆడి కొత్త వెర్షన్.. ధర, ఫీచర్స్ చూస్తే..
జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల కంపెనీ ఆడి భారత విపణిలోకి ఎస్ 5 స్పోర్ట్ బ్యాక్ సెడాన్ కొత్త వెర్షన్‌ను సోమవారం లాంచ్ చేసింది.

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల కంపెనీ ఆడి భారత విపణిలోకి ఎస్ 5 స్పోర్ట్ బ్యాక్ సెడాన్ కొత్త వెర్షన్‌ను సోమవారం లాంచ్ చేసింది.భారత్‌లో ఆడి ఎస్ 5 స్పోర్ట్ బ్యాక్‌ను 2017లో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన అప్‌డేట్ వెర్షన్ రానుంది. ఇక దీని ధర విషయానికి వస్తే రూ.79.06 లక్షలు (ఎక్స్ షోరూమ్).

ఆకర్షణీయమైన ఔటర్ డిజైన్‌తో పాటు, అప్‌డేట్ చేసిన క్యాబిన్‌తో రానుంది. ట్వీ్క్డ్ ఫ్రంట్ ఎండ్‌తో స్పోర్టీ లుక్‌ను కలిగి ఉంది. ఇంకా ఎల్‌ఈడీ హెడ్‌లైట్లతో పాటు, డే టైమ్ రన్నింగ్ లైట్లను కూడా అమర్చారు. క్వాడ్ టిప్ 19 అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంది. కారు ఇంటీరియల్స్‌లో భాగంగా 10 అంగుళాల టచ్ స్క్రీన్ ఉంటుంది.

కారుకు 354 హార్స్ పవర్‌ను అందించగల 3.0 లీటర్ ట్విన్ టర్బో, వి6 పెట్రోల్ ఇంజన్‌తో పాటు వస్తోంది. దీంతో కారుకు 500 ఏన్ఎమ్ గరిష్ట టార్క్‌ను అందిస్తోంది. స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌లో భాగంగా 8 స్పీడ్ టిప్టోనిక్ గేర్ బాక్స్‌ను కలిగి ఉంది. ఈ కారు 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 4.8 సెకన్లలో అందుకుంటుంది.

ఆడి ఎస్ 5 స్పోర్ట్ బ్యాక్ టాప్ స్పీడ్ 250 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. ఈ కారులో డైనమిక్, కంఫర్ట్, ఎఫిషియెన్సీ, ఆటో, ఇండివిజువల్‌తో సహా ఐదు డ్రైవింగ్ మోడ్‌లను ఏర్పాటు చేశారు. మెర్సిడెస్-ఎఎమ్‌జిసి 43, మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి 43 ఎఎమ్‌జి, బీఎండబ్ల్యూ ఎం 40 ఐ వంటి ఇతర లగ్జరీ కార్లతో ఆడి ఎస్ 5 పోటీపడనుంది.

Tags

Read MoreRead Less
Next Story