vehicle without steering: భలే కారు.. స్టీరింగ్ లేదు.. డ్రైవర్‌తో పన్లేదు..

vehicle without steering: భలే కారు.. స్టీరింగ్ లేదు.. డ్రైవర్‌తో పన్లేదు..
vehicle without steering: డ్రైవర్ లేని కార్లు వచ్చేస్తున్నాయని ఎప్పటి నుంచో వింటున్నాం.. ఇప్పుడు వచ్చేశాయి. చైనాకు చెందిన టెక్నాలజీ దిగ్గజం బైడూ అపోలో ఆర్‌టీ 6ని ఆవిష్కరించింది.

vehicle without steering: డ్రైవర్ లేని కార్లు వచ్చేస్తున్నాయని ఎప్పటి నుంచో వింటున్నాం.. ఇప్పుడు వచ్చేశాయి. డ్రాగన్‌ కంట్రీ టెక్కీ దిగ్గజం బైడూ మరో కొత్త అవిష్కరణ ను తీసుకువచ్చింది. ఫుల్‌ రేంజ్‌ ఆటానమస్‌ వెహికల్‌ అపోలో ఆర్‌ టీ-6ను ఆవిష్కరించింది..అసలు స్టీరింగ్‌ లేని ఈ కారును సిక్స్త్‌ జనరేషన్‌ కారుగా బైడూ చెప్పుకొచ్చింది..మెట్రో సిటీస్‌ రోడ్లకు అనుగుణంగా ఈ కారును రూపొందించారు. 2023 నాటికి ఈ కారు రోడ్ల మీద చక్కర్లు కొట్టనుంది...మొదట దీన్ని బైడూ సొంత రైడ్‌ సర్వీస్‌ అపోలో గో లో ప్రవేశ పెట్టనున్నారు...

అపోలో ఆర్‌టీ-6 ఒక్కో యూనిట్‌ రేటు దాదాపు 37,000 డాలర్ల వరకు ఉంటుందని బైడూ తెలిపింది. అపోలో ఆర్‌టీ-6తో ప్రపంచవ్యాప్తంగా అటానమస్‌ వాహన వినియోగం పెరుగుతుందని బైడూ విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. దీంతో ప్రపంచాన్ని డ్రైవర్‌ లెస్‌ కార్లకు దగ్గర చేస్తుందని అంటోంది...ధర అందుబాటులోకి వచ్చిన నేపధ్యంలో పెద్ద ఎత్తున ఈ కార్లను అందుబాటులోకి తెచ్చేందుకు బైడూ చెపుతోంది. ఆర్‌టీ-6 లాంటి రోబోట్యాక్సీలు అందుబాటులో వస్తే ప్రస్తుతం ట్యాక్సీకి చెల్లిస్తున్న ఛార్జీలు సగానికి తగ్గుతాయని తెలిపింది.

అపోలో ఆర్‌టీ6ను అత్యాధునిక అటానమస్‌ డ్రైవింగ్‌ సిస్టంతో అనుసంధానించారు. ఈ సిస్టం కంప్యూటింగ్‌ పవర్‌ 1200 టాప్స్‌. వాహనం ఎప్పుడూ 360 డిగ్రీల్లో దృష్టి సారించేలా మొత్తం 38 సెన్సార్లను అమర్చారు. వీటిలో 8 లైడార్లు, 12 కెమెరాలు ఉన్నాయి.ఈ అటానమస్‌ వాహనాలు ఇప్పటి వరకు నడిపిన 32 మిలియన్‌ కిలోమీటర్ల రియల్‌ వరల్డ్‌ డేటాను ఆర్‌టీ6కు అనుసంధానించారు. ఈ వాహనానికి ' ఇరవై ఏళ్ల నైపుణ్యం గల డ్రైవర్‌కు ఉన్న అనుభవం ఉంటుందని కంపెనీ తెలిపింది.'అపోలో గో' పేరుతో రోబోట్యాక్సీలను ప్రారంభించిన బైడూ..ఇప్పటి వరకు చైనాలో దాదాపు పది నగరాల్లో నగరాల్లో ట్యాక్సీ సర్వేస్‌ ను విస్తరించింది..

స్టీరింగ్‌ లేకపోవడంతో కారు లోపల స్పేషియస్‌ గా ఉంటుంది. దాంతో ప్రత్యేకమైన ఇంటీరియర్స్‌ను రూపొందించవచ్చని అంటోంది బైడూ. అదనపు సీట్లు, వెండింగ్‌ మెషీన్లు, డెస్క్‌టాప్‌లు, గేమింగ్‌ టేబుళ్లు కూడా ఏర్పాటు చేసుకునేలా ప్లాన్‌ చేసింది. పూర్తిగా ఫ్లాట్‌ ఫ్లోర్‌, ఇంటెలిజెంట్‌ ఇంటరాక్షన్‌ సిస్టం ఆర్‌టీ-6లో స్పెషల్‌ అట్రాక్షన్‌. అవుట్‌ లుక్‌ కూడా ట్రెండీగా రుపొందించిన్నట్లు కంపెనీ అంటోంది.. సన్‌రూఫ్‌పై సెన్సార్లు, ఇంటరాక్టివ్‌ లైట్లు, ఇంటెలిజెంట్‌ ఎలక్ట్రిక్‌ స్లైడింగ్‌ డోర్ల వంటి ఫీచర్లతో రైడింగ్‌ ఎక్స్‌పీరియెన్స్‌ ఎంజాయ్‌ చేయవచ్చు అంటోంది బైడూ.


Tags

Read MoreRead Less
Next Story