bajaj platina: కొత్త బజాజ్ ప్లాటినా.. అతి తక్కువ ధరలో.. అందరికీ అందుబాటులో

bajaj platina: కొత్త బజాజ్ ప్లాటినా.. అతి తక్కువ ధరలో.. అందరికీ అందుబాటులో
bajaj platina: అత్యుత్తమ ద్విచక్రవాహనాలను విడుదల చేసే బజాజ్ సంస్థ తాజాగా 2021 వర్షన్ ప్లాటినా 100ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది.

Bajaj Platina: బడ్జెట్ ధరలో బజాజ్ ప్లాటినా వచ్చేస్తుంది. అత్యుత్తమ ద్విచక్రవాహనాలను విడుదల చేసే బజాజ్ సంస్థ తాజాగా 2021 వర్షన్ ప్లాటినా 100ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ సరికొత్త ప్లాటినా 100 ఎలక్ట్రిక్ స్టార్ట్ (ఈఎస్‌)తో అందుబాటులోకి వచ్చింది. ఎక్స్ షోరూంలో ఈ మోటార్ సైకిల్ ప్రారంభ ధర వచ్చి రూ.53,920లుగా సంస్థ నిర్ధేశించింది.

అత్యాధునిక ఫీచర్లు, సబ్టిల్ కాస్మటిక్ అప్డేట్‌తో పాటు రియర్ వ్యూ మిర్రర్లు, సరికొత్త బాడీ గ్రాఫిక్స్‌తో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ఎల్‌ఈడీ డే టైమ్ రన్నింగ్ లైట్లు, హెడ్ ల్యాంపు యూనిట్లు, వైడ్ రబ్బర్ ఫూట్ ప్యాడ్లు, లాంగర్ సీటును కలిగి ఉండి రెడర్, పిల్లియన్‌కు మంచి సదుపాయాన్ని ఇస్తుంది. రెండు కలర్ ఆప్షన్లతో అందుబాటులో ఉన్న ఈ బైక్ కాక్ యెటిల్ వైన్ రెడ్, ఎబోనీ బ్లాక్‌తో కూడిన సిల్వర్ డెకల్స్ లో లభ్యమవుతోంది.

ఇక ఇంజిన్ విషయానికి వస్తే..

102 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఎస్‌ఓహెచ్‌ సీ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 7500 ఆర్పీఎం వద్ద 7.8 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 5500 ఆర్పీఎం వద్ద 8.36 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా 4-స్పీడ్గేర్ బాక్స్ వ్యవస్థతో పని చేస్తుంది.

2021 టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ లాంచ్.. డిస్క్ బ్రేక్ తో లభ్యం

ఈ సరికొత్త బజాజ్ ప్లాటినా ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనక వైపు హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్లతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా స్పింగ్ ఆన్ స్పింగ్ సస్పెన్షన్ సెటప్‌ను కలిగి ఉంది. బ్రేకింగ్ సెటప్ కూడా 130 ఎంఎం, 110 ఎంఎం డ్రమ్ బ్రేక్స్‌తో పాటు కాంబీ బ్రేకింగ్ సిస్టం (సీబీఎస్) ను కలిగి ఉంది. ఈ మోటార్ సైకిల్ 17 అంగుళాల వీల్స్ ను కలిగి ఉంది. దీంతో పాటు 100/80 ప్రొఫైల్ ట్యూబ్ లెస్ టైర్లు కలిగి ఉంది. ఈ మోటార్ సైకిల్ 11 లీటర్ ఫ్యూయల్ ట్యాంకు కెపాసిటీతో పాటు 117 కేజీల బరువును కలిగి ఉంది.

Tags

Read MoreRead Less
Next Story