బ్యాంక్ ఉద్యోగుల సమ్మె.. ఈ బ్యాంకులు మాత్రం తెరిచే ఉంటాయ్..

ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ గురువారం బ్యాంక్ ఉద్యోగులు సమ్మెకు దిగారు. బ్యాంక్ ఎప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాతో పలు సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు ఈ ఒక్క సమ్మెకు పిలుపునిచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే 3 కొత్త కార్మిక చట్టాలను ఆమోదించిందని, వీటి వల్ల 27 పాత చట్టాలు కనుమరుగు అయ్యాయని, దీనికి వ్యతిరేకంగానే ఈ సమ్మె చేస్తున్నట్టు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి.
బ్యాంకింగ్ రంగాన్ని కార్పొరేట్ కంపెనీలు ధ్వంసం చేస్తున్నాయని, నూతన ఆర్థిక విధానాలతో 40ప్రైవేట్ బ్యాంకులు దివాళా తీశాయని బ్యాంక్ ఉద్యోగ యూనియన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులను కాపాడుతూ, కార్పొరొట్ మొడి బకాయిల వసూలుకు తగిన చట్టాలను రూపొందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
గురువారం సమ్మె ప్రభావం తమపై ఉండదని ఎస్‌బీఐ, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లు ప్రకటించాయి. గురువారం తమ బ్రాంచీలు తెరిచి ఉంటాయని, యథావిధంగా అన్ని సేవలు కొనసాగుతాయని తెలిపాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com