Bank Holidays March 2021 : అలర్ట్ : మార్చి నెలలో 11 రోజులు బ్యాంకులకు సెలవులు..!

Bank Holidays March 2021 : మార్చి నెలలో మొత్తం దేశవ్యాప్తంగా బ్యాంకులకి మొత్తం పదకొండు రోజులు సెలవులు ఉండనున్నాయి. ఇందులో ఎప్పటిలాగే నాలుగు ఆదివారాలు, రెండు శనివారాలు బ్యాంకులు మూసివేయబడుతాయి. వీటితో పాటుగా వివిధ రాష్ట్రాల్లో ఐదు రోజులు సెలవు దినాలు ఉండనున్నాయి. అయితే ఈ సెలవులు రాష్ట్రాన్నీ బట్టి మారనున్నాయి.
మార్చి 5, 11, 22, 29, 30వ తేదీల్లో బ్యాంకులకు సెలవులు ఉంటాయని ఆర్బీఐ ప్రకటించింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి మార్చి 11న (గురువారం) మహాశివరాత్రి, మార్చి 30న (మంగళవారం) హోలీ పండుగలు నేపధ్యంలో బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి.
మార్చి 2021లో బ్యాంకు సెలవులు:
మార్చి 5 : చాప్చెర్ కుట్
మార్చి 7 ; ఆదివారం
మార్చి 11 : మహాశివరాత్రి
మార్చి 13 : రెండో శనివారం
మార్చి 14 : ఆదివారం
మార్చి 22 : బిహార్ డే
మార్చి 27 : నాలుగో శనివారం
మార్చి 28 : ఆదివారం
మార్చి 29 : ధులేటి/యావోసాంగ్ సెకండ్ డే
మార్చి 30 : హోలీ
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com