బ్యాంకులో మనీడిపాజిట్ చేస్తే వడ్డీ ఎంతో తెలుసా?

బ్యాంకులో మనీడిపాజిట్ చేస్తే వడ్డీ ఎంతో తెలుసా?
ఏయే బ్యాంకులో.. ఎంత వడ్డీ వస్తుందంటే..

ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులున్నాయి. కోవిడ్ వ్యాక్సిన్ వచ్చేవరకు టెన్షన్ తప్పదు. దీంతో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అంటూ కొందరు మదుపుదారులు ఆలోచనలో ఉన్నారు. మార్కెట్లు పాజిటివ్ గానే ట్రేడ్ అవుతున్నాయి. మంచి లాభాలే వస్తున్నాయి. అయినా ఎందుకైనా మంచిదని కొందరు ఇన్వెస్టర్లు కొంత మనీ ఫిక్సడ్ డిపాజిట్లుకు మళ్లిస్తున్నారు. ముందు జాగ్రత్తగా బ్యాంకుల్లో వారి వద్ద ఉన్న డబ్బులో కొంతమొత్తాన్ని బ్యాంకులో దాచుకుంటున్నారు. అది కూడా షార్ట్ టర్మ అంటే 6 నెలలకు కూడా FDలు చేస్తున్నారు. మరి అక్కడ వడ్డీ ఎంత వస్తుందో ఒకసారి తెలుసుకుందాం..

ఏయే బ్యాంకులో.. ఎంత వడ్డీ వస్తుందంటే..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4.4 శాతం వడ్డీ రేటు ఇస్తోంది. సీనియర్ సిటిజన్స్ కు అయితే 4.9వరకు వస్తోంది. 2 కోట్లకు పైగా FDచేస్తే మాత్రం 2.9శాతం వడ్డీ మాత్రమే ఇస్తుంది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో 4.5శాతం వడ్డీరేటు ఉంది. సీనియర్ సిటిజన్స్ కు 5.25శాతం ఇస్తోంది. 2 నుంచి 10 కోట్ల వరకు డిపాజిటర్లకు మాత్రం 3.25శాతం వడ్డీ చెల్లిస్తోంది.

HDFC బ్యాంకులో రూ.2 కోట్ల లోపు డిపాజిట్ దారులకు 4.1శాతం వడ్డీ రేటు ఇస్తోంది. సీనియర్ సిటిజన్లకు 4.6శాతం, 2 నుంచి ఐదు కోట్లు మధ్య డిపాజిట్ చేస్తే 3.50శాతం వడ్డీ రేటు ఇస్తారు.

ICICI బ్యాంకులో రూ.2 కోట్లలోపు FDలపై సాధారణ వడ్డీరేటు 4.25శాతంగా ఉంది. అయితే ఇందులో ప్రీమెచ్యూర్ విత్ డ్రాయల్ సదుపాయం కూడా ఉంది. సీనియర్ సిటిజన్లకు అయితు 4.75వరకు ఇస్తారు. రూ.2 నుంచి రూ.5 కోట్ల మధ్య ఉండే డిపాజిట్లపై 3.5శాతం వడ్డీ రేటు ఉంది.

సొ.. ప్రస్తుతానికి చాలావరకు బ్యాంకులు కొంచెం అటుఇటుగా FDలపై వడ్డీరేట్లు ఆఫర్ చేస్తున్నాయి. ఇప్పడున్న పరిస్థితుల్లో ట్రేడింగ్ లో పాల్గొంటూనే కొంత మొత్తాన్ని స్వల్పకాలిక ఫిక్సడ్ డిపాజిట్లలో మదుపుదారులు దాచుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story