BANKERS: డిజిటలైజేషన్‌లో బ్యాంకర్ల యూ టర్న్

BANKERS: డిజిటలైజేషన్‌లో బ్యాంకర్ల యూ టర్న్
X
పెరుగుతున్న మ్యూల్‌ అకౌంట్స్‌... సంప్రదాయ పద్ధతులకే మొగ్గు... ఆన్‌లైన్‌ ఖాతాలపై బ్యాంకర్లు అప్రమత్తం... బడా బ్యాంకుల కీలక నిర్ణయం 

కొ­త్త ఖా­తాల వి­ష­యం­లో బ్యాం­క­ర్లు డి­జి­ట­లై­జే­ష­న్‌ కంటే సం­ప్ర­దాయ పద్ధ­తు­ల­కే మొ­గ్గు చూ­పు­తు­న్నా­రు. ఆన్‌­లై­న్‌ ద్వా­రా బ్యాం­క్‌ ఖా­తా­ల­ను తె­రు­వా­ల­ని కో­రు­కు­నే కస్ట­మ­ర్ల కోసం బడా బ్యాం­కు లు ఇప్పు­డు భౌ­తిక పరి­శీ­ల­న­ల­కే ఆస­క్తి కన­బ­రు­స్తు­న్నా­యి మరి. మ్యూ­ల్‌ అకౌం­ట్లు, మో­సాల నే­ప­థ్యం­లో కస్ట­మ­ర్ల ఇం­టి­కే రి­లే­ష­న్‌­షి­ప్‌ మే­నే­జ­ర్లు వె­ళ్లి పని­ని పూ­ర్తి­చే­స్తు­న్నా­రు. లే­క­పో­తే కస్ట­మ­ర్ల­ను సమీప బ్యాం­క్‌ శా­ఖ­ల­కు రా­వా­ల­ని బ్యాం­క్‌ వర్గా­లు కో­రు­తు­న్నా­యి.

ఐసీ­ఐ­సీఐ బ్యాం­క్‌, హె­చ్‌­డీ­ఎ­ఫ్‌­సీ బ్యాం­క్‌, ఎస్బీఐ, బ్యాం­క్‌ ఆఫ్‌ బరో­డా, బ్యాం­క్‌ ఆఫ్‌ ఇం­డి­యా­లు తమ ఎం­డ్‌-టు-ఎం­డ్‌ డి­జి­ట­ల్‌ ఆన్‌­బో­ర్డిం­గ్‌ వ్య­వ­స్థ­ల్ని పక్క­న­పె­ట్టి­న­ట్టు తె­లు­స్తు­న్న­ది. ఐసీ­ఐ­సీఐ బ్యాం­క్‌ తమ ఇన్‌­స్టా-అకౌం­ట్‌ ఓపె­నిం­గ్‌ సర్వీ­స్‌­ను ఆపే­సిం­ద­ని సమా­చా­రం. కే­వ­లం సా­ల­రీ ఖా­తా­ల­కే డి­జి­ట­ల్‌ ప్ర­క్రి­య­ను వి­ని­యో­గి­స్తు­న్న­ట్టు చె­ప్తు­న్నా­రు. మి­గ­తా ఖా­తా­ల­ను ఆశిం­చే కస్ట­మ­ర్లు డా­క్యు­మెం­ట్స్‌ సమ­ర్ప­ణ­కు సమీప బ్యాం­క్‌ శా­ఖ­కు వె­ళ్లా­ల­ని బ్యాం­క్‌ అధి­కా­రు­లు సూ­చి­స్తు­న్నా­రు. దర­ఖా­స్తుల పరి­శీ­ల­న­కు కస్ట­మ­ర్ల ఇం­డ్ల­కే బ్యాం­క్‌ అధి­కా­రు­లూ వె­ళ్తు­న్నా­ర­ని బ్యాం­క్‌ వర్గా­లు చె­ప్తు­న్నా­యి. పైగా పె­రు­గు­తు­న్న మో­సా­ల­కు నో యు­వ­ర్‌ కస్ట­మ­ర్‌ (కే­వై­సీ) ని­బం­ధ­న­ల­ను పా­టిం­చ­క­పో­వ­డ­మే­నం­టూ రి­జ­ర్వ్‌ బ్యాం­క్‌ ఆఫ్‌ ఇం­డి­యా (ఆర్బీఐ) బ్యాం­కు­ల­పై జరి­మా­నా­ల­నూ వే­స్తు­న్న వి­ష­యం తె­లి­సిం­దే. దీం­తో ఈ ఫై­న్ల నుం­చీ తప్పిం­చు­కు­న్న­ట్టు అవు­తుం­ద­ని చాలా బ్యాం­కు­లు భౌ­తిక పరి­శీ­ల­న­ల­కే జై కొ­డు­తు­న్నా­యి. అమా­యక ఖా­తా­దా­రు­ల­ను ఏమా­ర్చి నే­ర­గా­ళ్లు.. తమ అక్రమ కా­ర్య­క­లా­పాల నుం­చి ఆర్జిం­చిన సొ­మ్ము­ను పొం­ద­డా­ని­కి, బది­లీ చే­య­డా­ని­కి వారి బ్యాం­క్‌ ఖా­తా­ల­ను వా­డు­కుం­టూ ఉం­టా­రు. మనకు తె­లి­య­కుం­డా­నే మో­స­పూ­రి­తం­గా మన డా­క్యు­మెం­ట్ల­ను వా­డు­కు­ని బ్యాం­కు­ల్లో మన పే­రిట ఖా­తా­ల­నూ తె­రు­స్తా­రు.

వీ­టి­నే మ్యూ­ల్‌ అకౌం­ట్స్‌ అం­టా­రు. అయి­తే ఈ వ్య­వ­హా­రా­న్ని బ్యాం­కు­లు గు­ర్తి­స్తే సదరు ఖా­తా­లు మూ­త­బ­డి­పో­తా­యి. అం­తే­గాక దీం­తో ప్ర­మే­యం­లే­ని అమా­య­కు­లు సమ­స్య­ల్లో పడు­తా­రు. భవి­ష్య­త్తు­లో వా­రి­కి బ్యాం­కిం­గ్‌ లా­వా­దే­వీ­లు కష్ట­త­రం­గా మా­రు­తా­యి. ఇక ఇటీ­వ­లి­కా­లం­లో ఈ మ్యూ­ల్‌ అకౌం­ట్స్‌ పె­రి­గి­పో­తు­న్నా­యి. గత ఏడా­ది పె­ద్ద­పె­ద్ద బ్యాం­కు­ల్లో మో­స­పూ­రిత నగదు లా­వా­దే­వీ­లు భా­రీ­గా­నే జరి­గి­న­ట్టు గు­ర్తిం­చా­రు. అం­దు­కే ఆన్‌­లై­న్‌ అకౌం­ట్‌ ఆన్‌­బో­ర్డిం­గ్‌ సర్వీ­సు ని­బం­ధ­న­ల్ని కఠి­న­త­రం చే­స్తు­న్నా­మ­ని బ్యాం­క్‌ సి­బ్బం­ది అం­టు­న్నా­రు. డి­జి­ట­ల్‌ బ్యాం­కిం­గ్‌ మా­ర్గాల ద్వా­రా నకి­లీ డా­క్యు­మెం­ట్ల­తో ఖా­తా­లు తె­రు­స్తు­న్న వై­నా­న్ని అడ్డు­కు­నే ది­శ­గా బ్యాం­కు­లు వె­ళ్తు­న్నా­య­ని, అం­దు­కే కస్ట­మ­ర్ల­ను నే­రు­గా సం­ప్ర­దిం­చా­కే ఖా­తా­ల­ను తె­రు­స్తు­న్నా­య­ని ఓ ఫ్రా­డ్‌ డి­టె­క్ష­న్‌ స్టా­ర్ట­ప్‌ వ్య­వ­స్థా­ప­కు­డు తె­లి­పా­రు.

మ్యూ­ల్‌ ఖా­తా­ల­ను గు­ర్తిం­చి సకా­లం­లో వా­టి­ని మూ­సే­య­క­పో­తే ఆర్బీఐ జరి­మా­నా వే­స్తు­న్న­ద­ని బ్యాం­క­ర్లు చె­ప్తు­న్నా­రు. అం­దు­కే ఆన్‌­లై­న్‌­లో ఖా­తాల కోసం వచ్చిన దర­ఖా­స్తు­ల­ప­ట్ల అప్ర­మ­త్తం­గా ఉం­టు­న్నా­మ­ని పే­ర్కొం­టు­న్నా­రు. అయి­న­ప్ప­టి­కీ కొ­త్త ఖా­తా­ల­కు డి­జి­ట­లై­జే­ష­న్‌ ఎంతో ము­ఖ్య­మ­ని కూడా వి­వ­రి­స్తు­న్నా­రు. కా­బ­ట్టి కస్ట­మ­ర్ల­ను నే­రు­గా కలి­సేం­దు­కు ప్ర­య­త్ని­స్తు­న్నా­మ­ని ప్ర­ధాన బ్యాం­క్‌­లో­ని ఓ ఉన్న­తో­ద్యో­గి తె­లి­పా­రు. ఇక ఖా­తా­దా­రు­ల­కు ఈ మో­సాల గు­రిం­చి అవ­గా­హన కల్పి­స్తు­న్నా­యి.

Tags

Next Story