1 July 2021 9:22 AM GMT

Home
 / 
బిజినెస్ / కొత్త మొబైల్...

కొత్త మొబైల్ కొనాలనుకునే వారి కోసం ఈ నెలలో రానున్న కొన్ని మోడల్స్

భారతదేశంలో అగ్రశ్రేణి స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు ఈ నెలలో కొన్ని కొత్త ఫోన్లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి.

కొత్త మొబైల్ కొనాలనుకునే వారి కోసం ఈ నెలలో రానున్న కొన్ని మోడల్స్
X

భారతదేశంలో అగ్రశ్రేణి స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు ఈ నెలలో కొన్ని కొత్త ఫోన్లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. షియోమి, రియల్‌మి, శామ్‌సంగ్ వంటి సంస్థలు గతంలో కంటే ఎక్కువ ఫోన్‌లను లాంచ్ చేస్తున్నాయి. జూలై 2021 లో లాంచ్ అవుతుందని భావిస్తున్న స్మార్ట్‌ఫోన్‌ల జాబితా..

#వన్‌ప్లస్ నార్డ్ 2వన్‌ప్లస్ నార్డ్‌కు కొనసాగింపుగా వన్‌ప్లస్ నార్డ్ 2 ను ఈ నెలలో రానుంది. సుమారు రూ.30 వేల ధర ఉంటుందని అంచనా. ఇది కూడా వన్‌ప్లస్ నార్డ్‌కి దగ్గరగా ఉన్నా ఫీచర్ల విషయానికి వస్తే మరిన్ని ఎక్కువ ఫీచర్లతో ఆకట్టుకుంటుందని టాక్.

# రియల్‌మీ జీటీ 5జీ5 జీ విభాగంలో రియల్‌మీ వరుసగా మొబైల్స్‌ను లాంచ్ చేస్తూ వస్తోంది. ఇటీవల ప్రపంచ మార్కెట్‌లో జీటీ 5జీ పేరుతో 5జీ మొబైల్‌ను తీసుకొచ్చింది. ఇది ఈనెలలోనే వినియోగదారులు చేరువ కానుంది.

#రెడ్‌మీ 10రెడ్‌మీ నుంచి 10 సిరీస్‌లో కొత్త మొబైల్స్ ఈ నెలలో మన దేశంలోకి రానున్నాయి.

#వీవో వీ21 ప్రోవివో కూడా జులైలో ఓ మొబైల్‌ను తీసుకొస్తోంది. నెలాఖరున వీవో వీ 21 ప్రో పేరుతో రాబోతోంది. 5జీ నెట్‌వర్క్‌తో రాబోతున్న ఈ మొబైల్‌లో మీడియాటెక్ డైమన్సిటీ 800 ప్రాసెసర్ వినియోగిస్తున్నారని సమాచారం. అలాగే ర్యామ్ కెపాసిటీ 8 జీబీ అని తెలుస్తోంది.

#టెక్సో స్పార్క్ గో 2021ఈ రోజే లాంచ్ అవుతున్న టెక్సో స్పార్క్ గో 6.5 అంగుళాల స్క్రీన్‌తో ఉంటుంది. 13 ఎంపీ మెయిన్ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ఫీచర్లు ఉన్నాయి.

#పోకో ఎక్స్ 3 జీటీపోకో నుంచి ఈ నెలలో ఓ మొబైల్ రాబోతోంది. చైనాలో విడుదల చేసిన రెడ్‌మీ నోట్ 10 ప్రో 5జీ వెర్షన్‌ను పోకో ఎక్స్ 3 జీటీ పేరుతో భారత్‌లో విడుదల చేస్తారని సమాచారం.

#ఒప్పో రెనో 6ఒప్పో రెనో 6 సిరీస్‌లో భాగంగా రెనో 6, రెనో 6 5 జీ మొబైల్స్‌ను మేలో చైనాలో లాంచ్ చేశారు. వాటిని అదే పేరుతో ఇండియన్ మార్కెట్లోకి తీసుకు వస్తారని టాక్. ఇందులో ముందు వైపు ఉండే 32 ఎంపీ కెమెరా ప్రధాన ఫీచర్.

#ఆసుస్ జెన్‌ఫోన్ 8ఆసుస్ జెన్‌ఫోన్ మొబైల్స్ మన దేశంలో జెన్ సిరసీ పేరుతో వస్తుంటాయి. అలా ఈ ఏడాది ఆసుస్ జెన్ 8 సిరీస్‌లో ఆసుస్ 8 జెడ్, 8 జెడ్ ఫ్లిప్ పేరుతో ఈ మొబైల్స్ వస్తాయి. వీటిలో క్వాల్‌కోమ్ స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్ ఉంటుంది.

Next Story