BETTIN APPS BILL: బెట్టింగ్ యాప్స్ ప్రమోట్‌ చేస్తే జైలుకే

BETTIN APPS BILL: బెట్టింగ్ యాప్స్ ప్రమోట్‌ చేస్తే జైలుకే
X
పార్లమెంట్‌లో ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు ఆమోదం.. నగదు లావాదేవీలతో నడిచే గేమ్స్‌ నిషేధం.. యాడ్స్, ప్రమోట్ చేస్తే జైలు శిక్ష, జరిమానా

ఆన్​­లై­న్​ బె­ట్టిం­గ్ ఎన్నో జీ­వి­తా­ల­ను నా­శ­నం చే­సిం­ది. వే­లా­ది కు­టుం­బా­ల­ను రో­డ్డున పడే­సిం­ది. ఈజీ మనీ కోసం చాలా మంది ఆన్​­లై­న్​ బె­ట్టిం­గ్​­కు బా­ని­స­లు­గా మారి సర్వం కో­ల్పో­తు­న్నా­రు. అప్పుల పాలై తను­వు చా­లిం­చిన వారూ ఉన్నా­రు. దే­శ­వ్యా­ప్తం­గా ఎన్నో కు­టుం­బా­ల్లో తీ­ర­ని వి­షా­దా­న్ని మి­గి­ల్చిన ఈ ఆన్‌­లై­న్ బె­ట్టిం­గ్‌­పై కేం­ద్ర ప్ర­భు­త్వం ఉక్కు­పా­దం మో­పు­తోం­ది. ని­జా­ని­కి ఆన్‌­లై­న్ గే­మిం­గ్ ద్వా­రా ప్ర­భు­త్వా­ని­కి ఇబ్బ­డి­ము­బ్బ­డి­గా ఆదా­యం సమ­కూ­రు­తు­న్న­ప్ప­టి­కీ.. ఆదా­యం కంటే సమాజ శ్రే­య­స్సు­కే ప్రా­ధా­న్యత ఇవ్వక తప్ప­ని పరి­స్థి­తి నె­ల­కొం­ది. అం­దు­కే కేం­ద్ర ప్ర­భు­త్వం పా­ర్ల­మెం­ట్ ఉభయ సభ­ల్లో ఆన్‌­లై­న్ గే­మిం­గ్ బి­ల్లు-2025ను ప్ర­వే­శ­పె­ట్టి ఆమో­దం తె­లి­పిం­ది. డబ్బు­తో ము­డి­ప­డ్డ ఎలాం­టి ఆన్‌­లై­న్ గే­మిం­గ్ ప్ర­క్రి­య­నై­నా ఈ బి­ల్లు పూ­ర్తి­గా ని­షే­ధి­స్తుం­ది. అదే సమ­యం­లో గే­మిం­గ్ పరి­శ్రమ దె­బ్బ­తి­న­కుం­డా ఉం­డేం­దు­కు 'రి­య­ల్ మనీ­'­తో సం­బం­ధం లే­కుం­డా ని­ర్వ­హిం­చే ఈ-స్పో­ర్ట్స్, ఆన్‌­లై­న్ సో­ష­ల్ గే­మిం­గ్‌­ను ప్రో­త్స­హిం­చ­డా­ని­కి సైతం ఈ బి­ల్లు­లో ప్ర­తి­పా­ద­న­లు పొం­దు­ప­రి­చిం­ది.

డబ్బులు పెట్టి ఆడే గేమ్​లపై

ప్ర­స్తు­తం దే­శం­లో ఆన్​­లై­న్​ బె­ట్టిం­గ్​ వ్యా­పా­రం వే­గం­గా అభి­వృ­ద్ధి చెం­దు­తోం­ది. యు­వ­త­లో వ్య­స­నం, ఆర్థిక నష్టా­లు, ఆత్మ­హ­త్య­ల­ను ప్ర­ధాన ఆం­దో­ళ­న­లు­గా పే­ర్కొం­టూ నగదు లా­వా­దే­వీ­ల­తో నడి­చే ఆన్‌­లై­న్ గే­మ్‌­ల­పై కేం­ద్రం ని­షే­ధం వి­ధిం­చిం­ది. అంటే డబ్బు­లు పె­ట్టి ఆడే అన్ని ఆట­ల­ను ని­షే­ధి­స్తూ ని­ర్ణ­యం తీ­సు­కుం­ది. ఫాం­ట­సీ క్రీ­డ­లు, పో­క­ర్, రమ్మీ వంటి కా­ర్డ్ గే­మ్‌­లు, ఆన్‌­లై­న్ లా­ట­రీ­ల­తో సహా అన్ని రకాల ఆన్‌­లై­న్ బె­ట్టిం­గ్, జూ­దం­పై ని­షే­ధం వి­ధిం­చిం­ది. గే­మిం­గ్‌ సం­బం­ధిత ని­ధు­ల­ను ప్రా­సె­స్‌ చే­య­కుం­డా బ్యాం­కు­లు, ఆర్థిక సం­స్థ­ల­పై ని­షే­ధం వి­ధిం­చా­రు. ఆన్​­లై­న్​ గే­మ్​­లు ఆడే­వా­రి­ని మా­త్రం శి­క్షల నుం­చి మి­న­హా­యిం­చా­రు. వీ­రి­ని బా­ధి­తు­లు­గా పరి­గ­ణిం­చా­ల­ని బి­ల్లు­లో పొం­దు­ప­రి­చా­రు. దీని కోసం గత మూ­డు­న్నర ఏళ్లు­గా కేం­ద్ర ప్ర­భు­త్వం ఈ సమ­స్య­ను పరి­ష్క­రిం­చేం­దు­కు ప్ర­య­త్ని­స్తోం­ది.

యాడ్స్, ప్రమోషన్స్ చేసినా నేరమే

ఆన్‌­లై­న్ గే­మిం­గ్ బి­ల్లు-2025 ని­బం­ధ­న­ల­ను ఉల్లం­ఘిం­చి డబ్బు ఆధా­రిత గే­మిం­గ్ సే­వ­ల­ను అం­దిం­చే సం­స్థ­లు, బా­ధ్యు­ల­కు మూ­డే­ళ్ల వరకు జైలు శి­క్ష లేదా ఒక రూ.కోటి వరకు జరి­మా­నా లేదా రెం­డూ వి­ధిం­చ­వ­చ్చు. ఆయా గే­మ్​­ల­ను ప్ర­చా­రం చేసే వ్య­క్తు­లు, సం­స్థ­ల­కు రెం­డే­ళ్ల దాకా జైలు, రూ.50 లక్షల జరి­మా­నా లేదా రెం­డు వి­ధిం­చే అవ­కా­శం ఉంది. అంటే గే­మిం­గ్ యా­ప్‌ల ప్ర­క­ట­న­ల్లో పా­ల్గొ­నే సినీ ప్ర­ము­ఖు­లు, ఇతర సె­ల­బ్రి­టీ­లు సైతం కొ­త్త చట్టం ప్ర­కా­రం శి­క్షా­ర్హు­లే అని బి­ల్లు స్ప­ష్టం చే­స్తోం­ది. చాలా ఆన్‌­లై­న్ గే­మిం­గ్ ప్లా­ట్‌­ఫా­మ్‌­లు తమ ఉత్ప­త్తు­ల­ను 'నై­పు­ణ్య ఆధా­రిత ఆట­లు­'­గా ము­సు­గు వే­సు­కు­ని, బె­ట్టిం­గ్ నుం­చి వే­రు­గా కని­పిం­చేం­దు­కు ప్ర­య­త్ని­స్తా­య­ని ప్ర­భు­త్వ వర్గా­లు తె­లి­పా­యి. కానీ కొ­త్త బి­ల్లు ప్ర­కా­రం ఇవ­న్నీ కచ్చి­తం­గా బె­ట్టిం­గ్‌­గా­నే పరి­గ­ణి­స్తూ చర్య­లు తీ­సు­కో­ను­న్న­ట్టు వె­ల్ల­డిం­చా­యి.

ఆందోళనలో ఆన్‌లైన్ గేమింగ్ రంగం

మరోవైపు డబ్బు ఆధారిత గేమింగ్ రంగంతో సంబంధం ఉన్న సంస్థలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశాయి. ఈ చట్టం లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న రంగాన్ని నాశనం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే, కేంద్రం మాత్రం ఆర్థిక లావాదేవీలతో సంబంధం లేకుండా సాగే ఈ-స్పోర్ట్స్, ఆన్‌లైన్ సామాజిక ఆటలను ప్రోత్సహించడానికి బడ్జెట్, కొత్త పథకాలతో పాటు ఒక ప్రాధికార సంస్థను ఏర్పాటు చేయనున్నట్టు బిల్లు ద్వారా తెలియజేస్తోంది. ఈ రంగం దెబ్బతినకుండా చూడడంతో పాటు ప్రోత్సహించే చర్యలు చేపట్టినట్టు వివరిస్తోంది. లోక్‌సభ, రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందింది. తర్వాత రాష్ట్రపతి ఆమోదముద్రతో చట్ట రూపం సంతరించుకుంటుంది.

Tags

Next Story