BHARAT TAXI: దూసుకొస్తోన్న "భారత్ ట్యాక్సీ"

BHARAT TAXI: దూసుకొస్తోన్న భారత్ ట్యాక్సీ
X
ప్రైవేట్ ట్యాక్సీలకు ధీటుగా భారత్ ట్యాక్సీ.. జనవరి 1 నుంచి సేవలు ప్రారంభం

కేం­ద్ర ప్ర­భు­త్వం నుం­చి ప్ర­యా­ణి­కు­ల­కు, ము­ఖ్యం­గా క్యా­బ్ డ్రై­వ­ర్ల­కు గుడ్ న్యూ­స్ చె­ప్పిం­ది. ఓలా, ఉబర్, ర్యా­పి­డో వంటి ప్రై­వే­ట్ క్యా­బ్ యా­ప్‌­ల­కు ధీ­టు­గా 'భా­ర­త్ ట్యా­క్సీ' అనే సరి­కొ­త్త యా­ప్‌­ను కేం­ద్రం తీ­సు­కొ­స్తోం­ది. ఈ యాప్... జీరో కమి­ష­న్ మో­డ­ల్‌­పై పని­చే­స్తుం­ది, అంటే డ్రై­వ­ర్ల­కు ప్ర­యా­ణి­కు­లు చె­ల్లిం­చిన మొ­త్తం.. ఫుల్ ఆదా­యం­గా వస్తుం­ది. అం­దు­లోం­చీ డ్రై­వ­ర్లు ఎవ­రి­కీ కమి­ష­న్ చె­ల్లిం­చా­ల్సిన అవ­స­రం లేదు. ప్ర­స్తు­తం ప్రై­వే­ట్ యా­ప్‌­ల్లో 20-30 శాతం కమి­ష­న్ కట్ అవు­తుం­ది కానీ, భా­ర­త్ ట్యా­క్సీ యా­ప్‌­లో అలాం­టి­ది లేదు. కే­వ­లం నా­మ­మా­త్ర­పు మెం­బ­ర్‌­షి­ప్ ఫీజు మా­త్ర­మే ఉం­టుం­ది. సహ­కార ట్యా­క్సీ కో­ఆ­ప­రే­టి­వ్ లి­మి­టె­డ్ పర్య­వే­క్ష­ణ­లో ఈ యాప్ నడు­స్తుం­ది. అమూ­ల్ (GCMMF), ఇఫ్కో, క్రి­బ్కో, నా­ఫె­డ్, ఎన్‌­డీ­డీ­బీ వంటి ప్ర­ముఖ సహ­కార సం­స్థ­లు ఈ కో­ఆ­ప­రే­టి­వ్‌ సం­స్థ­లో భా­గ­స్వా­ము­లు. డ్రై­వ­ర్లు కూడా షే­ర్‌­హో­ల్డ­ర్లు­గా మారి, ని­ర్ణ­యా­ల్లో పా­ల్గొం­టా­రు. ఇది ప్ర­పం­చం­లో­నే మొ­ట్ట­మొ­ద­టి డ్రై­వ­ర్ ఓన్డ్ నే­ష­న­ల్ మొ­బి­లి­టీ ప్లా­ట్‌­ఫాం. తాజా అప్‌­డే­ట్ ప్ర­కా­రం, ఢి­ల్లీ­లో డి­సెం­బ­ర్ నుం­చే భా­ర­త్ ట్యా­క్సీ యాప్.. సా­ఫ్ట్ లాం­చ్, పై­ల­ట్ రన్ జరు­గు­తోం­ది. ఇప్ప­టి­కే 51 వే­ల­కు పైగా డ్రై­వ­ర్లు రి­జి­స్ట­ర్ చే­సు­కు­న్నా­రు. జన­వ­రి 1, 2026 నుం­చి ఢి­ల్లీ­లో అధి­కా­రి­కం­గా ప్ర­యా­ణి­కు­లు ఈ యాప్ ద్వా­రా క్యా­బ్‌­లు బుక్ చే­సు­కో­వ­చ్చు. ఢి­ల్లీ తర్వాత గు­జ­రా­త్‌­లో­ని రా­జ్‌­కో­ట్, ఇతర నగ­రా­ల­కు వి­స్త­రి­స్తా­రు. దే­శ­వ్యా­ప్తం­గా వి­స్త­రణ ప్ర­ణా­ళిక ఉంది. అప్పు­డు ఆం­ధ్ర­ప్ర­దే­శ్, తె­లం­గా­ణ­లో కూడా అమ­ల్లో­కి వస్తుం­ది. అలా­గే తె­లు­గు రా­ష్ట్రా­ల్లో­నూ అతి తొం­ద­ర్లో­నే అమ­ల్లో­కి రా­నుం­ది.

భా­ర­త్ ట్యా­క్సీ యాప్ ఫీ­చ­ర్లు చూ­స్తే, రి­య­ల్ టైమ్ ట్రా­కిం­గ్, SOS బటన్, ట్రి­ప్ షే­రిం­గ్, యూ­పీఐ/కా­ర్డు పే­మెం­ట్స్, క్యా­న్సి­లే­ష­న్‌­ల­పై కఠిన ని­య­మా­లు ఉన్నా­యి. అంటే డ్రై­వ­ర్లు కచ్చి­తం­గా రూ­ల్స్ పా­టిం­చా­ల్సి ఉం­టుం­ది. సర్జ్ ప్రై­సిం­గ్ లేదు, ఫి­క్స్‌­డ్ ఫేర్ మా­త్ర­మే ఉం­టుం­ది. కా­బ­ట్టి డ్రై­వ­ర్లు ఇష్టం వచ్చి­న­ట్లు ఛా­ర్జీ­లు తీ­సు­కు­నే వీలు ఉం­డ­దు. ఈ యాప్.. ప్ర­యా­ణి­కు­ల­కు చవక ఛా­ర్జీ­లు, డ్రై­వ­ర్ల­కు ఎక్కువ ఆదా­యం వచ్చే­లా చే­స్తుం­ది. ప్ర­స్తు­తం గూ­గు­ల్ ప్లే స్టో­ర్‌­లో బీటా వె­ర్ష­న్‌­లో ఈ యాప్ అం­దు­బా­టు­లో ఉంది. ట్ర­య­ల్, ఫీ­డ్‌­బ్యా­క్ కోసం డౌ­న్‌­లో­డ్ చే­సు­కో­వ­చ్చు. IOS వె­ర్ష­న్ త్వ­ర­లో వి­డు­దల కా­నుం­ది. ఈ యాప్ రా­క­తో ఓలా, ఉబర్ వంటి కం­పె­నీ­ల­కు గట్టి పోటీ ఏర్ప­డ­నుం­ది. ప్ర­యా­ణి­కు­ల­కు అధిక ఛా­ర్జీల నుం­చి ఉప­శ­మ­నం లభి­స్తుం­ది.

ఈ వి­ష­యా­న్నీ కేం­ద్ర మం­త్రి అమి­త్ షా లో­క్‌­స­భ­లో వె­ల్ల­డిం­చా­రు. " 'స­హ­కా­ర్ సే సమృ­ద్ధి' మి­ష­న్‌­లో భా­గం­గా ఈ యాప్ వస్తోం­ది. మొ­త్తం­గా ఈ అప్‌­డే­ట్ డ్రై­వ­ర్ల­కు స్వ­తం­త్రం, ప్ర­యా­ణి­కు­ల­కు సౌ­ల­భ్యం తె­స్తుం­ది. అం­దు­కే ఈ యాప్ ఎప్పు­డు వస్తుం­దా అని ప్ర­జ­లు ఎదు­రు­చూ­స్తు­న్నా­రు. దే­శ­వ్యా­ప్తం­గా ప్రై­వే­ట్ క్యా­ప్ సర్వీ­సు­లు.. ప్ర­యా­ణి­కుల ప్ర­యాణ ఖర్చు­ల­ను వి­ప­రీ­తం­గా పెం­చే­స్తు­న్నా­యి. వేరే ప్ర­త్యా­మ్నా­యం లే­క­పో­వ­డం­తో ప్ర­జ­లు ఇబ్బం­ది పడు­తు­న్నా­రు. బస్సు­ల్లో వె­ళ్దా­మం­టే.. రద్దీ­గా ఉం­టు­న్నా­యి. మె­ట్రో రై­ళ్లు కూడా రద్దీ­గా­నే ఉం­టు­న్నా­యి. అం­దు­కే క్యా­బ్‌­ల­ను ఆశ్ర­యి­స్తు­న్నా­రు. భా­ర­త్ ట్యా­క్సీ యాప్ వస్తే.. ప్ర­జ­లు ఆ యాప్ ద్వా­రా­నే క్యా­బ్ సర్వీ­సు­లు బుక్ చే­సు­కు­నే అవ­కా­శం ఉంది." అని పే­ర్కొ­న్నా­రు.

Tags

Next Story