Bill Gates: మళ్లీ పెళ్లికి సిద్ధమంటున్న బిల్ గేట్స్.. ఎవరితో అంటే..?

Bill Gates: బిల్ గేట్స్ పేరు ప్రపంచ వ్యాపార రంగంలోనే ఓ సంచలనం. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడైన బిల్ గేట్స్ తన పర్సనల్ విషయాల గురించి పెద్దగా బయటపడేవారు కాదు. కానీ పెళ్లయిన 27 ఏళ్ల తర్వాత తన మిలిండా ఫ్రెంచ్‌కు విడాకులు ఇచ్చి అందిరికీ షాకిచ్చారు. ఇక విడాకులైన ఏడాది తర్వాత తన మాజీ భార్యపై, రెండో పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బిల్ గేట్స్.
గతేడాది మే లో తన భార్యతో విడిపోతున్నట్టు ప్రకటించాడు బిల్ గేట్స్. ఇక వీరిద్దరికీ ఆగస్ట్‌లో విడాకులు మంజూరు అయ్యాయి. అయితే విడాకులు అయిన ఇన్నాళ్ల తర్వాత మిలిండా గురించి మాట్లాడాడు బిల్ గేట్స్. తను చాలా గొప్ప వ్యక్తి అని చెప్పుకొచ్చాడు. అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవడం తనకు చాలా సంతోషంగా ఉంది అన్నారు. అంతే కాకుండా ఇంక తాను జీవితంలో మళ్లీ పెళ్లి చేసుకోను అని స్టేట్‌మెంట్ ఇచ్చారు.
భవిష్యత్తు గురించి తెలియదు కానీ అవకాశం వస్తే మళ్లీ మిలిండానే పెళ్లి చేసుకోవడానికి తాను సిద్ధమే అన్నారు బిల్ గేట్స్. విడాకులు జరిగిపోయాయి కాబట్టి దీనికి తాను ఒప్పుకుంటుందో లేదో అన్నారు. అయితే తన భార్యతో ఎందుకు విడిపోయారు అని బిల్ గేట్స్‌ను అడగగా.. వివాహాలు అనేవి చాలా క్లిష్టంగా ఉంటాయని, దాని గురించి లోతుగా పరిశోధించడం విలువైంది కాదని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com