రూ. లక్ష పెడితే ఏడాదిలో రూ.28.50లక్షలయ్యాయి

రూ. లక్ష పెడితే ఏడాదిలో రూ.28.50లక్షలయ్యాయి

స్టాక్ మార్కెట్లో ముందుచూపు, అవగాహన, తెలివితేటలతో పాటు.. అదృష్టం కూడా కలిసిరావాలి. షేరు మార్కెట్లో ఏడాది కిందట ఇన్వెస్టర్లు లక్ష రూపాయిలు పెడితే ఏకంగా రూ.28.50 లక్షలయ్యాయి. అదే బయోఫిల్ కెమికల్ కంపెనీ షేర్లు. అవును మీరు వింటున్నది నిజమే. అంటే ఏడాదిలో స్టాక్ మీద వచ్చిన లాభం ఏకంగా రూ.27.50లక్షలు. ఊహించగలమా? కానీ జరుగుతుంటాయి. గత ఏడాది నవంబర్ 13న ఈ కంపెనీ షేరు ధర రూ.4.42 పైసలు మాత్రమే. కానీ సంవత్సరం తిరిగే సరికి ప్రస్తుతం రూ.126.80 వద్ద ఉంది. అంటే 12 నెలల్లో షేరు 2768శాతం పెరిగింది. 52వారాల గరిష్టస్థాయిని అందుకుంది.

సన్ ఫార్మా కంపెనీ షేరు 21.73శాతం పెరిగింది. డా.రెడ్డీ ల్యాబ్స్ స్టాక్ ధర 72శాతం, సిప్లా 63.21శాతం పెరిగాయి. దివీస్ కూడా ఏడాదిలో 96శాతం పెరిగింది. కానీ ఈ కంపెనీ ఏకంగా 2768శాతం పెరిగింది. అయితే దీనికి కారణం కూడా ఉంది. కంపెనీ ఆదాయం తొలి త్రైమాసికంలో 100శాతం పెరిగింది. నెట్ ప్రాఫిట్ గత ఏడాది రూ.11లక్షలుగా ఉంటే... ఈ ఏడాది డబుల్ రూ.22లక్షలకు పెరిగింది. అమ్మకాలు కూడా 44.65శాతం పెరిగాయి. గత ఏడాది రూ.1.59కోట్ల అమ్మకాలుంటే.. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఇది రూ.2.30 కోట్లకు పెరిగింది.

బయోఫిల్ కంపెనీ ఇంజెక్షన్స్, ఐ డ్రాప్స్, కాప్యూల్స్, సిరప్ విభాగంలో ఉంది. ఇండోర్‌లో ప్లాంట్ ఉంది. అయితే ఈ స్టాక్ అనూహ్యంగా పెరిగింది. అయితే ఇక ముందు అంతకంటే ఎక్కువ పెరగకపోవచ్చని అంటున్నారు. కంపెనీ కేపిటల్ వాల్యూ ఒకసారి పరిశీలించిన తర్వాత.. ముఖ్యంగా నిపుణులను సంప్రదించిన తర్వాత నిర్ణయం తీసుకోండి.

Also Read:profit your trade


Tags

Read MoreRead Less
Next Story