Budget 2023: రూ. 7 లక్షల వరకు పన్ను లేదు

Budget 2023: రూ. 7 లక్షల వరకు పన్ను లేదు
X
5లక్షలుగా ఉన్న ఆదాయపన్ను పరిమితిని రూ.7 లక్షలకు పెంచుతున్నట్లు సీతారామన్ ప్రకటించారు


ఉద్యోగస్థులకు శుభవార్త. 7లక్షల వరకు పన్ను కట్టాల్సిన అవసరం లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రస్తుతం 5లక్షలుగా ఉన్న ఆదాయపన్ను పరిమితిని రూ.7 లక్షలకు పెంచుతున్నట్లు సీతారామన్ ప్రకటించారు. ఈ రోజు పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు.

రూ. 6 లక్షల నుంచి రూ. 9 లక్షల వార్షికాదాయం ఉన్నవారికి 10శాతం పన్ను, రూ.9 లక్షల నుంచి రూ. 12 లక్షల వరకు 15 శాతం పన్నును విధించనున్నట్లు తెలిపారు. ఇన్ కంట్యాక్స్ కు సంబంధించి 2020లో 6 శ్లాబుల విధానంలో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. వీటిని ఐదుకు తగ్గించింది. రూ.12 లక్షల నుంచి రూ.15లక్షలు, అంతకంటే ఎక్కువ వార్షికాదాయం ఉంటే 30శాతం పన్నును కట్టాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.కొత్త పన్ను విధానం డీఫాల్ట్‌గానే ఉంటుందని, పాత పన్ను విధానాన్ని పౌరులు ఎంచుకునేందుకు ఆప్షన్ ఉంటుందని తెలిపారు.

Tags

Next Story