డబ్బే డబ్బు..భారత్ కంపెనీల్లోకి వరదపారుతోంది..!

డబ్బే డబ్బు..భారత్ కంపెనీల్లోకి వరదపారుతోంది..!
స్టాక్ మార్కెట్లలోకి పెట్టుబడుల వరద అంటే నిజంగా వరదేమో అన్నట్లుగా ఇన్వెస్ట్‌మెంట్స్ వచ్చి పడుతున్నాయ్.

స్టాక్ మార్కెట్లలోకి పెట్టుబడుల వరద అంటే నిజంగా వరదేమో అన్నట్లుగా ఇన్వెస్ట్‌మెంట్స్ వచ్చి పడుతున్నాయ్. ప్రపంచవ్యాప్తంగా అన్ని మార్కెట్లలో ర్యాలీ కంటే మన మార్కెట్ అంటేనే బాగా నమ్మకం ఏర్పడిందో..లేక ఇంకా ర్యాలీ నడుస్తుందనో భరోసానో కానీ, ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు ఫిబ్రవరి నెల మొదటి 20 రోజుల్లోనే రూ.24,965కోట్ల ధనం పెట్టుబడి పెట్టారు.

బ్రేకప్ చేసి చూస్తే ఈక్విటీ మార్కెట్లలోనే రూ.24,204కోట్లు.. డెట్ సెగ్మెంట్‌లో రూ.761కోట్లు ఎఫ్‌పిఐలు ఇన్వెస్ట్ చేశారు. ప్రపంచంలో తైవాన్, భారత్‌లో మాత్రమే ఇలా FPI ఇన్వెస్ట్‌మెంట్స్ జోరు కొనసాగుతున్నట్లు కోటక్ సెక్యూరిటీస్ సంస్థ తన నివేదికలో వెలువరించింది.

కొంతకాలంగా డెట్ సెగ్మెంట్‌కి దూరంగా ఉన్న ఎఫ్‌పిఐలు ఇప్పుడు తిరిగి వాటిలోనూ పెట్టుబడులకు సిద్ధం కావడం మరో శుభసంకేతంగా మార్నింగ్ స్టార్ ఇండియా సంస్థ అభిప్రాయపడింది. ఐతే రాబోయే రోజుల్లో ప్రాఫిట్ బుకింగ్ జరిగి, కరెక్షన్ చోటు చేసుకుంటే మాత్రం ఈ జోరుకు కాస్త బ్రేక్ పడొచ్చనేది మరి కొందరి అంచనా.

అయితే ప్రపంచవ్యాప్తంగా రిజర్వ్ బ్యాంకులు పరిస్థితికి తగినట్లుగా వడ్డీరేట్లపై నిర్ణయాలు ప్రకటిస్తుండటం.. అన్ని స్టాక్ మార్కెట్లకు కలిసి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Also Read : profit your trade

Tags

Read MoreRead Less
Next Story