నష్టాల్లో ట్రేడ్ అవుతోన్న స్టాక్ మార్కెట్..

నష్టాల్లో ట్రేడ్ అవుతోన్న స్టాక్ మార్కెట్..
అత్యంత గరిష్ఠానికి చేరుకున్న తర్వాత నేడు 300 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్




మంగళవారం స్టాక్ మార్కెట్ నష్టాలతో మొదలైంది. వార్త రాసే సమయానికి ప్రధాన సూచీ అయిన సెన్సెక్స్ ౩౦౦ పాయింట్లకు పైగా నష్టపోగా, నిఫ్టీ 70 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. దాదాపు అన్నీ సూచీలు నష్టాల్లో ఉన్నాయి. దేశంలో స్థిరమైన GDP, అదుపులోనే ఉన్న ద్రవ్యోల్బణం మరియు విదేశీ పెట్టుబడిదారుల(FII) నుంచి కొనుగోళ్లు మార్కెట్‌కు సానుకూలాంశాలుగా చెప్పవచ్చు.

వరుస విదేశీ పెట్టుబడుల నేపథ్యంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ బలపడి 82 రూపాయిలకు దిగువన ట్రేడ్ అవుతోంది.

స్టాక్ మార్కెట్ నష్టాల్లో ఉన్నపటికీ సూచీలు ఆల్ టైం గరిష్ఠస్థాయిల్లోనే ఉన్నాయి. ఇటీవల అమెరికా ఫెడరల్ బ్యాంక్ వెల్లడించిన ద్రవ్య పరపతి విధానంలో సంవత్సరం పాటు పెంచిన వడ్డీ రేట్లను యథాతదంగా ఉంచడం కూడా ఒక ప్రధాన కారణం.




భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్వరలో అమెరికా పర్యటన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య రక్షణ ఒప్పందాలు ఉండబోతున్న నేపథ్యంలో రక్షణ రంగానికి చెందిన చాలా షేర్లు ముదుపర్లను ఆకర్షిస్తున్నాయి. భారత ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా విధానం వల్ల రక్షణ రంగంలో భారత్ స్వావలంభన దిశగా సాగుతోంది. దీంతో ఆ రంగానికి చెందిన చాలా స్టాక్స్ ముదుపర్లకు లాభాల పంట పండించాయి.

రెలిగేర్ బ్రోగింగ్ ప్రతినిధి అజిత్ మిశ్రా మాట్లాడుతూ.. "బ్యాంకింగ్ రంగంలో కొన్ని అస్థిరతల కారణంగా సూచీలు ఆల్ టైం గరిష్ఠం నుంచి దిగివస్తున్నాయి. అయినప్పటికీ మార్కెట్ ఆశావాహకంగానే ఉంటుంది. కీలక రంగాలైన ఆటో, FMCG, ఎనర్జీ, మిడ్ క్యాప్, స్మాల్‌ క్యాప్ కంపెనీల్లో కొన్ని షేర్లు దీర్ఘకాల పెట్టుబడికి అనుకూలంగా ఉన్నాయి" అని అన్నారు.

జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ మాట్లాడుతూ.. బ్యాంకింగ్ రంగం నుంచి ముదపర్లు లాభాలు స్వీకరిస్తున్న నేపథ్యంలో షేర్లు తమ గరిష్ఠాల నుంచి నష్టాల్లోకి జారుకుంటున్నాయి. రెండు రోజుల్లో అమెరికా ఫెడ్ ఛైర్మన్ టెస్టిమొనీ, చైనా వడ్డీ రేట్ల నిర్ణయాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు కూడా ఉపశమనం పొందాయన్నారు.

Tags

Read MoreRead Less
Next Story