Real Estate: ముఫ్పైల్లోనే ముచ్చటగా ఓ ఇల్లు సమకూర్చుకోవాలంటే..

Real Estate: త్వరగా ఎర్న్ చేయాలి.. అమ్మా నాన్న మీద ఇంకెంత కాలం ఆధారపడతాం.. నేటి యువత ఆలోచనలు ఆ దిశగా సాగుతున్నాయి.. క్యాంపస్ సెలక్షన్స్‌లో ఉద్యోగాలు.. 20ల్లోనే సొంత వ్యాపారం చేయాలన్న ఆలోచనలు.. వెరసి 30ల్లోనే ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.. లోన్ తీసుకోనో మరొకటో చేసి తమకంటూ ఓ సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవాలని కూడా కలలు కంటున్నారు.. ఒకప్పుడు కొన్ని బాధ్యతలు తీరాక మాత్రమే సొంత ఇంటి గురించి ఆలోచించే వారు.. కాలం మారింది.. యువత ఆలోచనలు మారుతున్నాయి.. ఈ పరిణామం మంచిదే..
ఇంటికి సంబంధించిన రుణాలు తక్కువ వడ్డీ రేటుతో అందుబాటులో ఉండడం, రాయితీలు కల్పించడంతో ఇళ్ల విక్రయాలు పెరిగాయి. దేశంలోని మిగతా నగరాలతో పోలిస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది.
ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండడంతో భాగ్యనగరానికి డిమాండ్ ఎక్కువైంది.
ఐటీ రంగంతో పాటు ఫార్మా రంగాల్లో ఉపాధి అవకాశాలు, ఆదాయాలు బాగుండడంతో రూ.40 లక్షల నుంచి రూ.80 లక్షల లోపు ఇళ్లకు అధిక డిమాండ్ ఉంటోంది.
నగర శివార్లలో కొత్త పరిశ్రమలు వస్తుండడంతో అందుబాటు ధరల్లో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు.
గత ఐదేళ్లుగా ధరలు 5 శాతం చొప్పున పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం చదరపు అడుగు సగటు ధర రూ.4240గా ఉంది. ప్రాంతాలను బట్టి ధరల్లో మార్పులు ఉంటాయి. హైదరాబాదులోని వెస్ట్ జోన్‌లో ఇళ్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ముందు ముందు మరింత పెరిగే అవకాశాలు ఉంటాయి. ముఫ్పైల్లోనే ముహూర్తం పెట్టేయడం మంచిదే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com