Home
 / 
బిజినెస్ / Who is Divya...

Who is Divya Gokulnath: వయసు 35 ఏళ్లు.. ఆస్తి 3 లక్షల కోట్లు.. ఎవరీ దివ్యా గోకుల్‌నాథ్..

Who is Divya Gokulnath: ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫాం బైజూస్ సంస్థకు పునాది రవీంద్రన్.. ఆయన భార్య దివ్య గోకుల్ నాథ్ ఓ స్ట్రాంగ్ పిల్లర్.

Who is Divya Gokulnath: వయసు 35 ఏళ్లు.. ఆస్తి 3 లక్షల కోట్లు.. ఎవరీ దివ్యా గోకుల్‌నాథ్..
X

Who is Divya Gokulnath: ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫాం బైజూస్ సంస్థకు పునాది రవీంద్రన్.. ఆయన భార్య దివ్య గోకుల్ నాథ్ ఓ స్ట్రాంగ్ పిల్లర్. మరికొంత మంది వ్యక్తుల సమూహం కలిసి ఈ రోజు బైజూస్‌ని దేశంలో నెంబర్ వన్ స్థానంలో నిలిచేలా చేసింది. ఈ రోజు దివ్య పేరు ఫోర్బ్స్ జాబితాలో నిలిచింది. ఆమె గురించి ప్రత్యేకంగా మాట్లాడుకునే అవకాశం కల్పించింది.

ఓ సాధారణ కుటుంబానికి చెందిన దివ్య బెంగళూరులోని RV కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి బయోటెక్నాలజీలో ఇంజనీరింగ్ పూర్తిచేసింది. తరువాత మాస్టర్స్ కోసం విదేశాలలోని విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేసుకోవాలని యోచిస్తోంది.


GRE కోసం ముందు తన గణిత నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలనుకుంది. స్నేహితుల ద్వారా బైజు రవీంద్రన్ తరగతుల గురించి విన్నది. క్లాసులకు అటెండై పరీక్ష రాసింది. GRE వ్రాసిన తరువాత, ఫలితాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఖాళీగా ఉండే బదులు బైజూస్‌లో క్లాసులు తీసుకోమని రవీంద్రన్ దివ్యను అడిగారు.

జీఆర్‌ఈ ఫలితాలు వచ్చేలోపు తన కంటే నాలుగు సంవత్సరాల తక్కువ వయసున్న విద్యార్థులకు క్లాసులు తీసుకున్నారు. గణితం, ఇంగ్లీష్, రీజనింగ్‌ గురించి విధ్యార్థులకు బోధిస్తున్నప్పుడు బోధనలో ఆనందం ఉందని తెలుసుకుంది. ఈలోపు జీఆర్‌ఈ ఫలితాలు వచ్చాయి. కానీ విదేశాలకు వెళ్లడాన్ని ఇష్టపడలేదు దివ్య." రెండు కారణాల వల్ల విదేశీ విద్యను విరమించుకుంది దివ్య. మొదట టీచింగ్‌ని ఇష్టపడటం.. రెండు తల్లిదండ్రుల ఏకైక బిడ్డగా బెంగుళూరులో ఉండటం మంచిదని అనుకున్నారు. ఈ క్రమంలోనే బైజూ రవీంద్రన్‌తో ప్రేమ, పెళ్లి.

విద్యార్ధులకు అర్థమయ్యేలా బోధించడం, వారానికి ఏడు రోజులు క్లాసులు తీసుకోవడం బైజూస్ ప్రత్యేకత. విద్యార్ధులకు నేర్చుకోవడం అనేది కష్టంగా కాకుండా ఇష్టంగా ఉండాలని నమ్ముతారు బైజూస్ వ్యవస్థాపకులు. అందుకే ఎప్పటికప్పుడు తమ స్కిల్స్‌ని మెరుగు పరుచుకుంటూ బోధనలో కొత్త పద్ధతులను అనుసరిస్తారు.

ఆ ఆలోచనా ఫలితమే 2015లో బైజూస్ లెర్నింగ్ యాప్‌కు కారణమైంది. దీనికి దివ్య కోఫౌండర్. సంస్థకు సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటూనే బోధనను కొనసాగిస్తున్నారు. విద్యార్ధులు సులువుగా అర్థమయ్యేలా బోధించడం దివ్య ప్రత్యేకత. అందుకే విద్యార్ధులు బైజూస్ పట్ల ఆకర్షితులయ్యారు.

మొదట 4-12 తరగతుల వారికోసం ప్రారంభమైన ఈ యాప్ ఇప్పుడు పోటీపరీక్షల వారికీ శిక్షణ ఇస్తోంది. ప్రస్తుతం ఈ యాప్‌ని ఏడున్నర కోట్ల మంది విద్యార్ధులు వినియోగించుకుంటున్నారు. ఫేస్‌బుక్ అధినేత జుకర్ బర్గ్ సహా ప్రపంచ వ్యాప్తంగా ఎందరో ప్రముఖులు బైజూస్‌లో పెట్టుబడులు పెట్టారు. ‌

కరోనా కారణంగా ఆన్‌లైన్ క్లాసులకు మరింత డిమాండ్ పెరిగింది. దీంతో దివ్య సంపద ఒక బిలియన్ డాలర్లు పెరిగి రూ.3.02 లక్షల కోట్లకు చేరింది. ఈ ఏడాదికిగాను ఫోర్బ్స్ విడుదల చేసిన దేశంలో 100 మంది సంపన్నుల జాబితాలో 47 మంది మహిళలుండగా దివ్య 4వ స్థానంలో నిలిచింది.

Next Story