GST: త్వరలో సామాన్యులకు గుడ్‌న్యూస్

GST: త్వరలో సామాన్యులకు గుడ్‌న్యూస్
X
మధ్య తర­గ­తి ప్ర­జ­ల­కు మరో గు­డ్‌­న్యూ­స్..?

ఆదాయ పన్ను­లో రా­యి­తీ­ల­తో వేతన జీ­వు­ల­కు కొంత ఊరట కల్పిం­చిన కేం­ద్ర ప్ర­భు­త్వం.. ఇప్పు­డు మధ్య తర­గ­తి ప్ర­జ­ల­కు మరో గు­డ్‌­న్యూ­స్ చె­ప్పేం­దు­కు సి­ద్ధ­మ­వు­తోం­ది. ని­త్యా­వ­సర వస్తు­వు­ల­పై వస్తు, సేవల పన్ను (జీ­ఎ­స్టీ) భా­రా­న్ని తగ్గిం­చేం­దు­కు కస­ర­త్తు చే­స్తు­న్న­ట్లు తె­లు­స్తోం­ది. ప్ర­స్తు­తం 12 శా­తం­గా ఉన్న జీ­ఎ­స్టీ శ్లా­బ్‌­ను పూ­ర్తి­గా తొ­ల­గిం­చ­డం లేదా 12 శా­తం­లో ఉన్న చా­లా­వ­ర­కు వస్తు­వు­ల­ను 5 శాతం ట్యా­క్స్‌ శ్లా­బ్‌ పరి­ధి­లో­కి తీ­సు­కు­రా­వా­ల­ని యో­చి­స్తోం­ది. దీం­తో మధ్య­త­ర­గ­తి ప్ర­జ­ల­పై భారం తగ్గిం­చా­ల­ని భా­వి­స్తోం­ద­ని వి­శ్వ­స­నీయ వర్గాల సమా­చా­రం.

ఈ వస్తువులపై జీఎస్టీ తగ్గింపు?

ఈ ని­ర్ణ­యం అమ­లై­తే పేద, మధ్య తర­గ­తి ఎక్కు­వ­గా వి­ని­యో­గిం­చే టూ­త్‌­పే­స్ట్, కు­క్క­ర్లు, గీ­జ­ర్లు, సై­కి­ళ్లు, రూ. 1000 పై­బ­డిన రె­డీ­మే­డ్ దు­స్తు­లు, రూ.500-1000 మధ్య ధర ఉండే ఫు­ట్‌­వే­ర్, వ్యా­క్సి­న్లు, సి­రా­మి­క్ టై­ల్స్ వంటి అనేక వస్తు­వుల ధరలు గణ­నీ­యం­గా తగ్గు­తా­యి. అయి­తే, ఈ ప్ర­తి­పా­ద­న­కు పం­జా­బ్, కేరళ, పశ్చిమ బెం­గా­ల్ వంటి రా­ష్ట్రాల నుం­చి వ్య­తి­రే­కత వ్య­క్త­మ­వు­తు­న్న­ట్లు తె­లు­స్తోం­ది. జీ­ఎ­స్టీ­కి సం­బం­ధిం­చిన ఏ మా­ర్పు­ల­కై­నా జీ­ఎ­స్టీ కౌ­న్సి­ల్ ఆమో­దం తప్ప­ని­స­రి. ప్ర­తి­పా­దిత వస్తు­వు­ల­పై జీ­ఎ­స్టీ తగ్గి­స్తే అవి తక్కువ ధరకే పేద, మధ్య­త­ర­గ­తి వర్గా­ల­కు లభి­స్తా­యి.

ప్రభుత్వ ఖజానాపై భారీ ప్రభావం

కేం­ద్రం తీ­సు­కో­బో­యే ఈ ని­ర్ణ­యం వల్ల ప్ర­భు­త్వ ఖజా­నా­పై సు­మా­రు రూ.40,000 కో­ట్ల నుం­చి రూ.50,000 కో­ట్ల భారం పడొ­చ్చ­ని అం­చ­నా వే­స్తు­న్నా­రు. అయి­తే, ఆయా ఉత్ప­త్తు­ల­పై జీ­ఎ­స్టీ తగ్గిం­చ­డం ద్వా­రా వి­ని­యో­గం పె­రి­గి, ఆర్థిక వ్య­వ­స్థ­కు ఊతం లభి­స్తుం­ది. పన్ను పరి­ధి పె­ర­గ­డం­తో పాటు దీ­ర్ఘ­కా­లం­లో జీ­ఎ­స్టీ వసూ­ళ్లు కూడా పె­రు­గు­తా­య­ని ప్ర­భు­త్వం భా­వి­స్తోం­ది. జీ­ఎ­స్టీ రే­ట్ల­ను హే­తు­బ­ద్ధీ­క­రిం­చా­ల­ని భా­వి­స్తు­న్న­ట్లు ఇటీ­వల కేం­ద్ర ఆర్థి­క­మం­త్రి ని­ర్మ­లా సీ­తా­రా­మ­న్‌ వె­ల్ల­డిం­చా­రు. ఈ ని­ర్ణ­యా­లు తీ­సు­కో­వా­లం­టే జీ­ఎ­స్టీ కౌ­న్సి­ల్‌­లో ఏకా­భి­ప్రా­యం సా­ధిం­చా­ల్సి ఉం­టుం­ది. ఈ నె­లా­ఖ­రు­లో జీ­ఎ­స్టీ మం­డ­లి సమా­వే­శం జరి­గే అవ­కా­శం ఉం­ద­ని తె­లు­స్తోం­ది. కౌ­న్సి­ల్‌­లో రా­ష్ట్రాల మధ్య ఏకా­భి­ప్రా­యం కు­ది­రి­తే­నే సా­మా­న్యు­డి­కి ఈ ఊరట దక్క­నుం­ది. ఈ ఏడా­ది ప్రా­రం­భం­లో ఆదా­య­పు పన్ను వి­ష­యం­లో పన్ను రహిత ఆదాయ పరి­మి­తి­ని న్యూ టా­క్స్ రీ­జి­మ్ కింద రూ.12 లక్ష­ల­కు పెం­చు­తూ ఆర్థిక మం­త్రి­త్వ శాఖ బడ్జె­ట్లో చే­సిన ప్ర­క­టన మధ్య­త­ర­గ­తి ప్ర­జ­ల­కు పె­ద్ద ఉప­శ­మ­నా­న్ని కలి­గిం­చిం­ది.

Tags

Next Story