bike taxi: ఉబర్, ఓలా, ర్యాపిడో సంస్థలకు గుడ్‌న్యూస్

bike taxi: ఉబర్, ఓలా, ర్యాపిడో సంస్థలకు గుడ్‌న్యూస్
X
పీక్ అవర్స్‌లో ఛార్జీలు పెంచుకునే అవకాశం.. త్వరలో కొత్త మార్గదర్శకాలు అమలు... క్యాన్సిల్ చేస్తే ఛార్జీలో 10శాతం పెనాల్టీ

ఆన్‌­లై­న్ క్యా­బ్ సర్వీ­సు­లు అం­ది­స్తు­న్న ఉబ­ర్‌, ఓలా, ర్యా­పి­డో వంటి సం­స్థ­ల­కు కేం­ద్రం గు­డ్‌­న్యూ­స్ చె­ప్పిం­ది. క్యా­బ్ సం­స్థ­లు పీ­క్‌ అవ­ర్స్‌­లో తమ ఛా­ర్జీ­ల­ను గరి­ష్ఠం­గా 2 రె­ట్లు వరకు పెం­చు­కో­వ­చ్చ­ని వె­సు­లు­బా­టు కల్పిం­చిం­ది. ఈ మే­ర­కు మో­టా­ర్‌ వె­హి­కి­ల్ అగ్రి­గే­ట­ర్‌ గై­డ్‌­లై­న్స్‌­ను కేం­ద్ర రో­డ్డు రవా­ణా, జా­తీయ రహ­దా­రుల మం­త్రి­త్వ శాఖ జారీ చే­సిం­ది. ఇప్ప­టి­వ­ర­కు ఈ సర్జ్‌ ప్రై­సిం­గ్‌ గరి­ష్ఠ పరి­మి­తి 1.5 రె­ట్లు వరకు ఉం­డే­ది. దీ­న్ని తా­జా­గా 0.5 రె­ట్లు పెం­చిం­ది. రా­బో­యే మూడు నె­ల­ల్లో కొ­త్త మా­ర్గ­ద­ర్శ­కా­ల­ను అమలు చే­యా­ల­ని కేం­ద్రం రా­ష్ట్రా­ల­కు సూ­చిం­చిం­ది.

రద్దీ సమయంలో 200శాతం పెంపు

జూలై 1న జారీ చే­సిన కొ­త్త ని­బం­ధ­నల ప్ర­కా­రం.. నా­మ­మా­త్రం­గా రద్దీ ఉన్న సమ­యా­ల్లో బే­స్‌ ఛా­ర్జీ­ల్లో సగం సర్‌­ఛా­ర్జీ కింద పెం­చు­కు­నేం­దు­కు వీలు కల్పిం­చిం­ది. అలా­గే ఒక­వేళ రద్దీ వి­ప­రీ­తం­గా ఉంటే 200 శాతం పెం­చు­కు­నేం­దు­కు అను­మ­తి­చ్చిం­ది. అం­త­కు­ముం­దు ఈ వె­లు­సు­బా­టు 150 శా­తం­గా ఉం­డే­ది. ఇక, మూడు కి­లో­మీ­ట­ర్ల లోపు ప్ర­యా­ణా­ని­కి ఎలాం­టి అద­న­పు ఛా­ర్జీ­లు వి­ధిం­చ­కూ­డ­ద­ని షరతు వి­ధిం­చిం­ది. మరో­వై­పు యా­ప్‌ ద్వా­రా రై­డ్‌­ను అం­గీ­క­రిం­చిన తర్వాత సరైన కా­ర­ణం చె­ప్ప­కుం­డా డ్రై­వ­ర్ క్యా­న్సి­ల్‌ చే­స్తే.. ఛా­ర్జీ­లో 10 శాతం పె­నా­ల్టీ (రూ.100 మిం­చ­కుం­డా) పడు­తుం­ది. దా­ని­ని డ్రై­వ­ర్, అగ్రి­గే­ట­ర్ ప్లా­ట్‌­ఫా­మ్‌ (ఓలా, ఉబర్, ర్యా­పి­డో వంటి సం­స్థ­లు) చెరి సమా­నం­గా చె­ల్లిం­చా­ల్సి ఉం­టుం­ది. సరైన కా­ర­ణం చె­ప్ప­కుం­డా రైడ్ క్యా­న్సి­ల్ చే­సి­నా ఇదే పె­నా­ల్టీ వర్తి­స్తుం­ది.

క్యాబ్ డ్రైవర్ల సంక్షేమంపై ఫోకస్

డ్రై­వ­ర్ల సం­క్షే­మం­పై కేం­ద్ర ప్ర­భు­త్వం ప్ర­ధా­నం­గా ఫో­క­స్ పెం­చిం­ది. ప్ర­యా­ణి­కుల భద్రత కోసం క్యా­బ్ సం­స్థల కింద సే­వ­లు అం­దిం­చే వా­హ­నా­ల­కు వె­హి­కి­ల్ లొ­కే­ష­న్, ట్రా­కిం­గ్ పరి­క­రా­లు తప్ప­ని­స­రి­గా అమ­ర్చా­ల­ని స్ప­ష్టం చే­సిం­ది. ఇం­టి­గ్రే­టె­డ్ కమాం­డ్ అండ్ కం­ట్రో­ల్‌ సెం­ట­ర్ల­కు అం­దు­బా­టు­లో ఉం­చా­ల­ని తె­లి­పిం­ది. ఈ అగ్రిగేటర్ ప్లాట్‌ఫామ్‌లతో అనుబంధంగా ఉన్న ప్రతి డ్రైవర్‌కు కనీసం రూ.5లక్షల ఆరోగ్య బీమా, రూ.10 లక్షల మేర టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజ్‌ను ఆ క్యాబ్‌ సంస్థలు తప్పనిసరిగా అందించాలని పేర్కొంది. ఈ వేదికల ద్వారా ప్యాసింజర్‌ రైడ్స్‌ కోసం ప్రైవేట్‌ మోటార్‌ సైకిళ్లను ఉపయోగించడానికి అనుమతించింది.

కర్ణాటకలో బైక్ ట్యాక్సీల నిలిపివేత

ఇటీ­వల కర్ణా­టక వ్యా­ప్తం­గా బై­క్‌ ట్యా­క్సీ­లు ని­లి­చి­పో­యా­యి. మో­టా­ర్‌ వె­హి­క­ల్‌ చట్టం­లో బై­క్‌ ట్యా­క్సీల ప్ర­స్తా­వన లే­క­పో­వ­డం­తో ఈ సే­వ­ల­ను ని­లి­పి­వే­యా­లం­టే కర్ణా­టక హై­కో­ర్టు సిం­గి­ల్‌ బెం­చ్‌ గతం­లో ఉత్త­ర్వు­లు జారీ చే­సిం­ది. జూ­న్‌ 15 వరకు గడు­వు ఇచ్చిం­ది. ఈ అం­శం­పై క్యా­బ్‌ సర్వీ­సు సం­స్థ­లు సవా­ల్ చే­య­గా.. డి­వి­జ­న్‌ బెం­చ్‌ కూడా సిం­గి­ల్‌ బెం­చ్‌ ఆదే­శా­ల­ను సమ­ర్థిం­చిం­ది. దాం­తో వాటి సే­వ­లు ని­లి­చి­పో­యా­యి. బై­క్‌ ట్యా­క్సీ­ల­పై ని­షే­ధం వల్ల గి­గ్‌­వ­ర్క­ర్ల జీ­వి­తా­లు రో­డ్డు­న­ప­డ­తా­యం­టూ తీ­వ్ర ఆం­దో­ళన వ్య­క్త­మైం­ది. ఈ నే­ప­థ్యం­లో­నే ప్రై­వే­ట్‌ మో­టా­ర్‌ సై­కి­ళ్ల­ను ఉప­యో­గిం­చ­డా­ని­కి కేం­ద్రం అను­మ­తి ఇచ్చిం­ది. కొ­త్త ని­బం­ధ­నల ప్ర­కా­రం.. ఆటో­లు, బైక్ ట్యా­క్సీ­లు, సహా ఇతర వా­హ­నా­ల­కు బే­స్‌ ఛా­ర్జీ­ల­ను ని­ర్ణ­యిం­చే అధి­కా­రా­న్ని కేం­ద్రం రా­ష్ట్రా­ల­కు అం­దిం­చిం­ది. ఒక­వేళ రా­ష్ట్రా­లు బే­స్‌ ఛా­ర్జీ­ల­ను అధి­కా­రి­కం­గా నో­టి­ఫై చే­య­క­పో­తే.. ఆ ధర­ల­ను ప్ర­క­టిం­చే బా­ధ్యత అగ్రి­గే­ట­ర్ల­దే­న­ని వె­ల్ల­డిం­చిం­ది. పలు రా­ష్ట్రా­ల్లో కా­ర్య­క­లా­పా­లు ని­ర్వ­హి­స్తు­న్న రా­పి­డో, ఉబర్ వంటి బైక్ ట్యా­క్సీ ఆప­రే­ట­ర్లు ఈ చర్య­ను స్వా­గ­తి­స్తు­న్నా­రు.

Tags

Next Story