Oil Prices : తగ్గుముఖం పట్టిన వంటనూనెల ధరలు.. హోల్‌సేల్‌ మార్కెట్‌లో ధరలు ఇలా..!

Oil Prices : తగ్గుముఖం పట్టిన వంటనూనెల ధరలు.. హోల్‌సేల్‌ మార్కెట్‌లో ధరలు ఇలా..!
Oil Prices : మొన్నటివరకు సలసల మండిపోయిన వంటనూనెల ధరలు ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి.

Oil Prices : మొన్నటివరకు సలసల మండిపోయిన వంటనూనెల ధరలు ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. సుంకాలు తగ్గించడంతో హోల్‌సేల్ మార్కెట్‌లో వివిధ రకాల వంటనూనెల ధరలు ఇలా ఉన్నాయి. వీటికి సంబంధించిన వివరాలను కేంద్రం వెల్లడించింది. గతేడాది ఇదే సమయానికి ధరలు పోలిస్తే అధికంగానే ఉన్నాయి. నూనె ధరల వివరాలను ఎప్పటికప్పుడు ప్రకటించాలంటూ వ్యాపారులను కేంద్రం ఆదేశించింది.

హోల్‌సేల్‌ మార్కెట్‌లో టన్ను పామాయిల్‌ ధర రూ. 12,666 ఉండగా 2.50 శాతం తగ్గి ప్రస్తుతం రూ. 12,349గా ఉంది.

♦ టన్ను సీసమ్‌ ఆయిల్‌ 2.08 శాతం తగ్గి ప్రస్తుతం ధర రూ. 23,500గా ఉంది.

♦ టన్ను కొబ్బరి నూనె ఆయిల్‌ 1.72 శాతం తగ్గి ప్రస్తుతం ధర రూ. 17,100గా ఉంది.

♦ టన్ను సన్‌ఫ్లవర్‌ నూనె ధర 1.30 శాతం తగ్గి ప్రస్తుతం రూ. 15,965గా ఉంది.

♦ టన్ను పల్లి నూనె ధర 1.38 శాతం తగ్గి ప్రస్తుతం రూ. 16,839గా ఉంది.

♦ టన్ను ఆవాల నూనె ధర 1 శాతం తగ్గి ప్రస్తుతం రూ. 16,573గా ఉంది.

Tags

Read MoreRead Less
Next Story