Artificial Intellegince: చైనా, అమెరికా మధ్య AI వార్..

Artificial Intellegince: చైనా, అమెరికా మధ్య AI వార్..

ప్రస్తుత టెక్నాలజీ రంగం మొత్తం ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) లేదా కృత్రిమ మేధలో వచ్చే అభివృద్ధి చుట్టూ తిరుగుతూ ఉంది. ఇందులో వచ్చే నూతన ఆవిష్కరణల కోసం ప్రతిరోజూ వేచి చూస్తుంటారు. ఇటీవల ఛాట్‌జీపీటీ(chatGPT) అప్లికేషన్ ఈ రేస్‌ని వేగంగా పరిగెత్తించేలా చేసింది. ఛాట్‌జీపీటీ సామర్థ్యాన్ని పసిగట్టిన టెక్నాలజీ దిగ్గజం గూగుల్ దానికి పోటీగా బార్డ్‌ను ఆవిష్కరించింది.


ఈ AI రేస్‌లో చైనా, అమెరికాలు తమ ఆధిపత్యాన్ని చాటుకోవాలని తహతహలాడుతూ పోటీపడుతున్నారు. చైనా, అమెరికాల మధ్య నడిచే వాణిజ్య పోటీ మొత్తం ప్రపంచ ఆర్థిక గతినే మారుస్తుంది. ఇప్పుడు AI రేస్ మొగ్గ దశలోనే ఉంది. ఈ రంగంలో తమ సత్తా చాటడానికి ప్రపంచంలోని అన్ని దేశాలకు సమాన అవకాశాలు ఉన్నాయి. ఈ సాంకేతిక అభివృద్ధిలో అమెరికా 3 సంవత్సరాలు ముందుంది. కానీ దీనిని అందుకోవడం మాత్రం అంత కష్టమేమీ కాకపోవచ్చని చైనా నిపుణులు అంటున్నారు.

సెమీ కండక్టర్ల తయారీలో ఆధిపత్యం కొనసాగిస్తోన్న చైనా, AI టెక్నాలజీలో కూడా తమ ముద్ర ఉండాలని ఉవ్విళ్లూరుతోంది. దీనిని పసిగట్టిన అమెరికా ప్రభుత్వం చైనా దీనిని దుర్వినియోగపరచుకండా AI సాంకేతికతకు ఉపయోగించే చిప్‌లపై నియంత్రణ విధించాలనుకుంటోంది. ఈ నిర్ణయం NVIDA వంటి చిప్ తయారీ సంస్థలకు చిక్కులు తేనుంది. ఇది రెండు దేశాల మధ్య ఇప్పటికే ఉన్న వైరాన్ని హీటెక్కిస్తోంది.

అమెరికా కంపెనీలను దీటుగా ఎదుర్కోవడానికి చైనాలో పెట్టుబడులు పెట్టేందుకు బిలియనీర్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. టెన్సెంట్ హోల్డింగ్స్ లిమిటెడ్, అలీబాబా గ్రూప్ హోల్డింగ్, బైదు వంటి టెక్ దిగ్గజాలు దేశీయ, విదేశీ కంపెనీల నుండి ప్రఖ్యాత పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు, అనుభవజ్ఞులైన ఇంజనీర్లను విజయవంతంగా ఆకర్షించాయి. సోగౌ సెర్చ్ ఇంజిన్ వ్యవస్థాపకుడు వాంగ్ జియోచాన్, ఇప్పటికే బైచూన్ అనే AIసంస్థను నెలకొల్పి, 50 మిలియన్ డాలర్ల సీడ్ క్యాపిటల్‌ను ఆకర్షించగలిగాడు. తన పాత కంపెనీలోని సహోద్యోగులను తన కంపెనీలో నియమించుకుంటున్నాడు.


అమెరికా ఈ రంగంలో పెట్టుబడులతో చైనా కంటే ముందు వరసలో ఉంది. ఈ దూరం క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇప్పుడే చైనాలో రంగంలోకి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి. అమెరికా కంపెనీలు 26.6 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టగా, చైనా 4 బిలియన్ డాలర్లు పెట్టింది.

స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరుగుతూ వస్తున్న కాలంలో చైనాకు చెందిన టెన్సెంట్, అలీబాబా, టిక్‌టాక్ వంటి కంపెనీలు అమెరికా కంపెనీల్ని తలదన్నేలా నిలిచాయి. ఇదే కాలంలో చైనాలోని ప్రభుత్వం యూట్యూబ్, గూగుల్, ఫేస్‌బుక్ వంటి కంపెనీల్ని నిషేధించడం కూడా వారి వృద్ధికి తోడ్పడింది. ఇప్పుడు కూడా కృత్రిమమేధ సాయంతో ఛాట్‌జీపీటీ, బార్డ్‌లు లేకుండా సొంతంగా ఎదగాలని ప్రయత్నాలు ప్రారంభించింది.



Tags

Read MoreRead Less
Next Story