శ్రావణమాసం వచ్చిన కూత ఆగడం లేదు.. రేటు తగ్గడం లేదు..!

సాధారణంగా శ్రావణమాసం వచ్చిందంటే మహిళలు చాలా భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. నాన్ వెజ్ కి చాలా దూరంగా ఉంటారు. ఈ క్రమంలో చికెన్ ధరలు అమాంతం తగ్గిపోతాయి. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా ఉంది పరిస్థితి. తగ్గాల్సిన చికెన్ రెట్లు పెరుగుతున్నాయి. గత నెలలో 220 నుంచి 250 మధ్య ఉన్న చికెన్ ధర ఆగస్టులో 300 రూపాయలకు చేరింది. కారణం డిమాండ్ తగ్గడమే. కోడికి వేసే దానాల్లో ప్రధానంగా సొయా, మొక్కజొన్న ఉంటుంది. కరోనాకి ముందు కేజీ సొయా 35కి దొరికేది.. కానీ ఇప్పుడు ధర కిలోకి 105 రూపాయలకు పెరిగింది. అటు మొక్కజొన్న దాన కేజీకి 12, 13 రూపాయలు ఉండేది. ఇప్పుడు డబుల్ అయింది.
దానా ఖర్చులు పెరగడంతో చాలా మంది కోళ్ల పెంపకాన్ని నిలిపివేశారు. దీనితో డిమాండ్ కి తగ్గట్టుగా ఉత్పత్తి లేకపోవడంతో కోళ్లను వివిధ ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. రవాణా చార్జీలు, లేబర్ చార్జీలు పెరిగిపోవడంతో కోడి ధర ఇప్పుడు కొండెక్కి కూర్చుంది. అయితే గుడ్డు ధర కాస్త బెటర్ అని చెప్పాలి. మొన్నటివరకు ఆరు రూపాయలకి లభించిన కోడిగుడ్డు ఇప్పుడు అయిదు రూపాయలకే లభిస్తుంది. అటు కరోనా మొదటి వేవ్ లో చికెన్ ధరలు దారుణంగా పడిపోయాయి. చికెన్ తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. తద్వారా కరోనాను ఎదురుకోవచ్చునని వైద్యులు చెప్పడంతో మళ్లీ చికెన్ ధరలకు రెక్కలు వచ్చాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com