కేంద్రాన్ని తాకిన పెట్రో సెగ.. సమ్మెకు దిగనున్న ట్రాన్స్‌పోర్టర్లు..

కేంద్రాన్ని తాకిన పెట్రో సెగ.. సమ్మెకు దిగనున్న ట్రాన్స్‌పోర్టర్లు..
ఈ నేపథ్యంలో ట్రాన్స్‌పోర్టర్లు కేంద్రాన్ని హెచ్చరించారు.

డీజిల్, పెట్రోల్ ధరల పెరుగుదల సామాన్యుడి గుండెల్లో సెగలు రేపుతున్నాయి. రోజు రోజుకి పెరుగుతున్న పెట్రోల్ ధరలు లీటరుకు రూ.100 చెల్లించే పరిస్థితి వచ్చింది. సొంత వాహన దారులతో పాటు షేరింగ్ వెహికల్స్‌లో ప్రయాణించే వారికి ఈ పెట్రో, డీజిల్ ధరల పెంపు భారంగానే పరిగణించనుంది. ఈ నేపథ్యంలో ట్రాన్స్‌పోర్టర్లు కేంద్రాన్ని హెచ్చరించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల, వీటిపై అధిక పన్నులకు నిరసనగా దేశవ్యాప్తంగా సమ్మెకు దిగుతామని ప్రకటించారు. డీజిల్ ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయని ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్ AIMTC తెలిపింది.

దీంతో పాటు ఇవే బిల్లు, స్కాపేజ్ పాలసీ వంటి పలు అంశాల గురించి చర్చ జరిగిందని ఏఐఎంటీసీ తెలిపింది. ఏఐఎంటీసీలో దాదాపు 95 లక్షల ట్రక్ డ్రైవర్లు, దాదాపు 50 లక్షల మంది బస్సు డ్రైవర్లు, టూరిస్ట్ ఆపరేటర్లు సభ్యులుగా ఉన్నారు.

ఏఐఎంటీసీ కేంద్రానికి 14 రోజుల నోటీస్ పీరియడ్ ఇచ్చింది. ఈలోగా ఏఐఎంటీసీ డిమాండ్లు నెరవేర్చాలని లేదంటే దేశవ్యాప్త ధర్నాకు దిగుతామని హెచ్చరించింది.

Tags

Read MoreRead Less
Next Story