నాలుగు నెలల్లోనే...ఐదు సార్లు..సామాన్యులకు గుదిబండగా LPG గ్యాస్ ధరలు

LPG Gas Cylinder Price: వంట గ్యాస్ ధరలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికే కరోనాతో కుదేలైన సామాన్యులకు... రోజురోజుకు పెరుగుతున్న LPG గ్యాస్ ధరలు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. పెరుగుతున్న గ్యాస్ బండ ధరలు...మధ్యతరగతి వర్గాల ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం పడుతోంది. కేవలం తొమ్మిది నెలల వ్యవధిలోనే... సిలిండర్ ధర 265 రూపాయలకు పైగా పెరగటం తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు నాలుగు నెలల కాలంలోనే ఐదు సార్లు గ్యాస్ ధరలకు రెక్కలొచ్చాయి.
పెరిగిన వంటగ్యాస్ ధరలతో తెలంగాణలో వినియోగదారులపై సుమారు 150 కోట్ల రూపాయలకుపైగా అదనపు భారం పడుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1.10 కోట్ల వంట గ్యాస్ కనెక్షన్లున్నాయి. నెలకు సగటున 65 నుంచి 70 లక్షల సిలిండర్లను.. మూడు చమురు సంస్థలు వినియోగదారులకు అందిస్తున్నాయి.. ఏప్రిల్ నెలలో సిలిండరుపై10 రూపాయలు తగ్గించింది. కరోనా సమయంలో వాణిజ్య వినియోగం తగ్గినప్పటికీ గృహావసరాల సిలిండర్ల వినియోగం పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు తొమ్మిది నెలల కాలంలో వంట గ్యాస్ ధర 265 రూపాయలకు పైగా పెంచిన కేంద్రం సబ్సిడీలోనూ కోత విధించింది. ఈ ఏడాది కాలంగా సబ్సిడీ 40.71 రూపాయలు మాత్రమే చెల్లిస్తూ వచ్చింది.
తొమ్మిది నెలల్లో అయిదు సార్లు మాత్రమే ధర పెంచినట్లు కనిపిస్తున్నప్పటికీ... పెరుగుతున్న ధరలు...సామాన్యుడిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. వాణిజ్యావసరాలకు వినియోగించే 19 కిలోల సిలిండరు ధరను ఏడాది వ్యవధిలో ...507 రూపాయలకు పైగా పెంచింది. వాణిజ్యావసరాల సిలిండర్ భారంతో ...హోటళ్లు ఇతర తినుబండారాల విక్రయాలపై ప్రభావం పడుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
వీటితోపాటు పెట్రోల్ , డీజీల్ ధరలు సైతం భారీగానే పెరిగాయి. ఏడాదిలో పెట్రోల్‌పై 18 రూపాయలకు పైగా కనపించగా డీజిల్ భారం 16 రూపాయలకు పైగా పడింది. తెలంగాణలో రోజూ సగటున పెట్రోలు 50 లక్షల లీటర్లు, డీజిల్ 1.10 కోట్ల లీటర్ల మేర విక్రయిస్తున్నారు. కరోనాతో అమ్మకాలు తగ్గినా అయిదారు నెలల్లో అటూఇటుగా సాధారణ పరిస్థితికి పెట్రోలు, డీజిల్ విక్రయాలు చేరుకున్నట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com