మార్చిలో మార్కెట్లోకి జైడలా కాడిలా కోవిడ్ వ్యాక్సిన్!

వచ్చే ఏడాది మార్చిలో కోవిడ్-19 వ్యాక్సిన్‌ను మార్కెట్లోకి విడుదల చేసేందుకు జైడస్ క్యాడిలా కసరత్తు చేస్తోంది. వచ్చేవారం కోవిడ్-19 వ్యాక్సిన్ రెండో దశ ట్రయల్స్ ఫలితాలు రానున్నాయి. ఈ ఫలితాల్లో వ్యాక్సిన్‌కు సంబంధించి విజయవంతమైన రిపోర్ట్ వచ్చే అవకాశాలున్నాయని జైడస్ క్యాడిలా ఆశాభావం వ్యక్తం చేస్తోంది. రెండో దశ ఫలితాలు వచ్చేవారం రానుండగా, మూడో దశ ఫలితాలు డిసెంబర్‌లో వెలువడనున్నాయని కంపెనీ అంచనా వేస్తోంది.
అన్ని అనుకూలిస్తే వచ్చే ఏడాది మార్చిలో ప్రపంచ మార్కెట్లోకి వ్యాక్సిన్‌ను విడుదల చేయనున్నట్టు కంపెనీ విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తొలి దశలో 100 మిలియన్ డోసులను తయారు చేస్తామని, ఆ తర్వాత సామర్థ్యాన్ని పెంచుకుంటామని కంపెనీ తెలిపింది. వ్యాక్సిన్‌కు సంబంధించి రెగ్యులేటరీ అనుమతులు వస్తే ఉత్పత్తిని వేగవంతం చేస్తామని జైడస్ క్యాడిలా చైర్మన్ పంకజ్ ఆర్ పటేల్ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com