Hemophilia B : హిమోఫిలియో బి సమస్యకు మెడిసిన్.. ధర తెలిస్తే గుండె ఢమాల్..

Hemophilia B : హిమోఫిలియో బి సమస్యకు మెడిసిన్.. ధర తెలిస్తే గుండె ఢమాల్..
Hemophilia B : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మెడిసిన్‌ మార్కెట్లోకి వచ్చింది. కాస్ట్లీయెస్ట్‌ మెడిసిన్‌ అంటే అంతా ఇంతా కాదు ఏకంగా కోట్లలలోనే ఉంది ఈ మెడిసిన్‌.

Hemophilia B : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మెడిసిన్‌ మార్కెట్లోకి వచ్చింది. కాస్ట్లీయెస్ట్‌ మెడిసిన్‌ అంటే అంతా ఇంతా కాదు ఏకంగా కోట్లలలోనే ఉంది ఈ మెడిసిన్‌. హిమోఫిలియా బి అనే సమస్యకు ఆస్ట్రేలియా ఫార్మా కంపెనీ CSL లిమిటెడ్‌ ఈ మెడిసిన్‌ను తయారు చేసింది.



రక్తం గడ్డ కట్టడం వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలతో కూడిన అరుదైన ఈ లోపానికి అందుబాటులోకి వచ్చిన తొలి జన్యుపరమైన చికిత్స ఇదే. ఆస్ట్రేలియాలో ఈ మెడిసిన్‌ ధరను 3.5 మిలియన్ డాలర్లుగా నిర్ణయించారు. అంటే మన కరెన్సీలో చెప్పాలంటే 28.6 కోట్ల రూపాయలు అన్నమాట. అమెరికా డ్రగ్‌ కంట్రోల్‌ సంస్థ ఎఫ్‌డీఏ దీనికి ఆమోదముద్ర వేసింది. దీంతో హీమోజెనిక్స్ పేరుతో అమెరికాలో ఈ మెడిసిన్‌ను అమ్ముతున్నారు..


అయితే ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 40 వేల మందిలో ఒకరు హిమోఫిలియా బి సమస్యతో బాధపడుతున్నారు. లివర్‌లో ఉత్పత్తి అయ్యే ఫ్యాక్టర్-9 ప్రొటీన్ లోపంతో ఈ హిమోఫిలియా బి సమస్య వస్తుంది. తాము తీసుకొచ్చిన చికిత్సలో జన్యుపరంగా మార్పులు చేసిన వైరస్ ఒక ప్రత్యేకమైన జన్యు పదార్థాన్ని లివర్‌లో ప్రవేశపెడుతుందని, అప్పడు కాలేయం నుంచి ఫ్యాక్టర్-9 విడుదలవుతుందని CSL ఫార్మా కంపెనీ తెలిపింది .


మరోవైపు హిమోఫిలియా-B ట్రీట్‌మెంట్‌ కోసం గతంలో అనేక ఫార్మా కంపెనీలు మెడిసిన్స్‌ను అందుబాటులోకి తెచ్చినా, ఇది మాత్రం చాలా స్పెషల్‌ ఎందుకంటే ఇది జన్యుపరమైన చికిత్స. అత్యంత ఖరీదైన ఈ చికిత్సలో ఓ ప్రత్యేకమైన జన్యు పదార్ధాన్ని లివర్‌లో ప్రవేశపెడుతుంది. ఇది దీర్ఘకాలికంగా పనిచేస్తూ డిసీజ్‌ను కంట్రోల్‌ చేస్తోంది. వరల్డ్‌ కాస్ల్టీయెస్ట్‌ మెడిసిన్‌ అమ్మకాలను ఆల్రెడీ మొదలుపెట్టింది అమెరికా. హీమోజెనిక్స్‌ పేరుతో మార్కెట్‌లో రిలీజ్‌ చేసింది..


ఇక హిమోఫిలియో బి సమస్యకు ప్రస్తుతం మార్కెట్‌లో రెండు మెడిసిన్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఓ మెడిసిన్‌ రేటు 2.8 మిలియన్ డాలర్లు అయితే, మరో మెడిసిన్‌ కాస్ట్‌ 3 మిలియన్ డాలర్లు. ఇప్పుడు లేటెస్ట్‌గా మార్కెట్లోకి వచ్చిన మెడిసిన్‌ కాస్ట్‌ మాత్రం 3.5 మిలియన్ డాలర్లు.

Tags

Read MoreRead Less
Next Story