క్రెడాయ్‌ కొత్త కార్యవర్గమిదే..!

క్రెడాయ్‌ కొత్త  కార్యవర్గమిదే..!
ఆగస్ట్‌ 13 నుంచి 3 రోజుల పాటు జరగనున్న ఈ ప్రాపర్టీలో రియల్టర్ల దగ్గర నుంచి, నిర్మాణ రంగానికి చెందిన అనేక విభాగాలకు చెందిన సంస్థలు కొలువుదీరనున్నట్టు క్రెడాయ్‌ హైదరాబాద్‌ ప్రెసిడెంట్‌ రామకృష్ణారావు తెలిపారు.

ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా అన్ని కోవిడ్‌ మార్గదర్శకాలకు పరిగణలోకి తీసుకుని ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నట్టు కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా.. క్రెడాయ్‌ హైదరాబాద్‌ ప్రకటించింది. ఆగస్ట్‌ 13 నుంచి 3 రోజుల పాటు జరగనున్న ఈ ప్రాపర్టీలో రియల్టర్ల దగ్గర నుంచి, నిర్మాణ రంగానికి చెందిన అనేక విభాగాలకు చెందిన సంస్థలు కొలువుదీరనున్నట్టు క్రెడాయ్‌ హైదరాబాద్‌ ప్రెసిడెంట్‌ రామకృష్ణారావు తెలిపారు. ఇక్కడి పొటెన్షియాలిటీని చాటి చెప్పడానికి ఏర్పాటు చేసిన మెగా ఈవెంట్ కావడంతో... హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణాలోని జిల్లాల నుంచి ఈ ప్రాపర్టీ షోకు పెద్ద సంఖ్యలో సందర్శకులు హాజరవుతారనిక్రెడాయ్‌ హైదరాబాద్‌ జనరల్‌ సెక్రటరీ వి.రాజశేఖర్‌ రెడ్డి చెప్పారు. గత ఏడాది కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ప్రాపర్టీ షోను వాయిదా వేశామని... వచ్చేనెల జరిగే ఈ ప్రాపర్టీ షో ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయమవుతుందని క్రెడాయ్‌ హైదరాబాద్‌ జాయింట్‌ సెక్రటరీ కె.రాంబాబు ధీమా వ్యక్తం చేశారు.

కొలువుదీరిన కొత్త కార్యవర్గం..!

క్రెడాయ్‌ హైదరాబాద్‌ నూతన కార్యవర్గం ఏర్పాటైంది. 2021-23 ఏడాదికి గానూ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు క్రెడాయ్‌ ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. అధ్యక్షుడిగా పి.రామకృష్ణారావు తిరిగి నియమితులయ్యారు. ఉపాధ్యక్షులుగా జి.ఆనంద్‌రెడ్డి, కంచం రాజేశ్వర్‌, ఎన్‌.జయదీప్‌ రెడ్డి, బి. జగన్నాథరావు, ప్రధాన కార్యదర్శిగా వి. రాజశేఖర్‌రెడ్డి, కోశాధికారిగా ఆదిత్య గౌరాను ఎన్నుకున్నారు. ఇక సంయుక్త కార్యదర్శులుగా కె.రాంబాబు, శివరాజ్ ఠాకూర్.. ఎగ్జిక్యూటివ్‌ కమిటీ మెంబర్లుగా బి.ప్రదీప్‌రెడ్డి, ఎం.సతీష్‌కుమార్‌, జి.నితీశ్‌రెడ్డి, సంజయ్‌కుమార్ బన్సల్‌, ఎ.శ్రీనివాస్‌, కె.క్రాంతికిరణ్‌ రెడ్డి, ఎన్‌.వంశీధర్‌రెడ్డి, శ్రీరామ్‌ ముసునూరులను ఎన్నుకున్నట్లు తెలిపారు.Tags

Read MoreRead Less
Next Story