6 Aug 2021 10:58 AM GMT

Home
 / 
బిజినెస్ / కొబ్బరి చిప్పలతో...

కొబ్బరి చిప్పలతో కిచెన్‌వేర్‌.. పెట్టుబడి పెద్దగా అవసరంలేని వ్యాపారం

మరియా కురియకోస్, కొబ్బరి చిప్పల నుండి గిన్నెలు, ఇతర ఉత్పత్తులను తయారు చేస్తోంది. పనికి రాని వస్తువు ఏదీ లేదంటూ వ్యర్థాలను వినియోగించి వస్తువులు తయారు చేస్తూ ఉపాధికి కొత్త మార్గాలు సృష్టించింది.

కొబ్బరి చిప్పలతో కిచెన్‌వేర్‌..  పెట్టుబడి పెద్దగా అవసరంలేని వ్యాపారం
X

కేరళలోని త్రిసూర్ నివాసి మరియా కురియకోస్, కొబ్బరి చిప్పల నుండి గిన్నెలు, ఇతర ఉత్పత్తులను తయారు చేస్తోంది. పనికి రాని వస్తువు ఏదీ లేదంటూ వ్యర్థాలను వినియోగించి వస్తువులు తయారు చేస్తూ ఉపాధికి కొత్త మార్గాలు సృష్టించింది.

స్వంతంగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనేది నా చిన్ననాటి కల. కానీ అది ఎలా ఉంటుందో నాకు తెలియదు అని కేరళలోని త్రిసూర్ నివాసి అయిన మరియా కురియకోస్‌ తెలిపింది.

ఇందుకోసం తాను చేస్తున్న ఉద్యోగాన్ని విడిచిపెట్టింది. 2017 లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ పూర్తి చేసిన తర్వాత, ఒక కార్పొరేట్ కంపెనీలో పని చేసింది. ఒక సంవత్సరం మాత్రమే ఆ ఉద్యోగాన్ని చేసి మనసుకు నచ్చిన పని చేయాలని మానేసింది. అక్కడి నుంచి శానిటరీ ప్యాడ్‌లను తయారు చేయడానికి మురికివాడల్లోని మహిళలతో కలిసి పనిచేసే సామాజిక సంస్థలో చేరాను, "అని 26 ఏళ్ల యువతి చెప్పింది.అనుకోకుండా ఓ రోజు త్రిసూర్‌లోని కొబ్బరి నూనె మిల్లును సందర్శించడం ఆమె వ్యాపారానికి అవసరమైన స్ఫూర్తిని ఇచ్చింది.

"కొబ్బరి ఒక ప్రత్యేకమైన చెట్టు. ఇందులో ప్రతి భాగాన్ని ఉపయోగించుకోవచ్చు. కానీ కొబ్బరి చిప్పలు అనవసరంగా పారవేయడాన్ని గమనించింది. కొంత మంది ఇంధనంగా వాడుతున్నారు. 8,000 కొబ్బరి చిప్ప ఆధారిత ఉత్పత్తులు తెంగా అనే స్వదేశీ బ్రాండ్‌ను ప్రారంభించడానికి దారితీసింది.

వ్యర్థాల నుండి సంపాదించడం

2019 లో, మరియా కొబ్బరి-షెల్ ఆధారిత ఉత్పత్తులను విక్రయించాలని నిర్ణయించుకున్న తర్వాత, ఆమె ఉప ఉత్పత్తులను తయారు చేస్తున్న కళాకారులు, నిపుణులతో కొన్ని నెలలు గడిపింది.

"కొబ్బరి చిప్పల నుండి ఉత్పత్తులను తయారు చేయడానికి కొన్ని యంత్రాలు అవసరమని తెలుసుకుంది. ప్రధానంగా షెల్ యొక్క వెలుపలి, లోపలి భాగాలను స్ర్కబ్ చేయడం ద్వారా మృదువైన ఫినిషింగ్ ఇవ్వబడుతుంది "అని మరియా చెప్పింది.

అయితే, ట్రయల్ రన్ చేసినందుకు మాత్రమే ఆమె యంత్రాల కొనుగోలుపై పెద్ద పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడలేదు. ఆమె 65 ఏళ్ల తండ్రి కురియాకోస్ సహాయం చేయడానికి ముందుకొచ్చారు. రిటైర్డ్ మెకానికల్ ఇంజనీర్ అయినందున, యంత్రం అతి తక్కువ-ధరలో చేయడానికి ఏమి అవసరమో అతనికి తెలుసు."హార్డ్‌వేర్ స్టోర్‌లో విడిభాగాలను కొనుగోలు చేయడం ద్వారా, నాన్న కొబ్బరి చిప్ప లోపలి, వెలుపలి భాగాలను మృదువుగా చేయడానికి అవసరమైన ఇసుక యంత్రాలను తయారు చేసారు. మా అమ్మ, జాలీ కురియకోస్ సమీపంలోని ఆయిల్ మిల్లు నుండి వివిధ పరిమాణాల కొబ్బరి చిప్పలను కలెక్ట్ చేయడానికి సహాయపడింది "అని మరియా చెప్పింది.

తుది దశగా, షెల్స్ వార్నిష్ వంటి రసాయన ఆధారిత ఉత్పత్తులకు బదులుగా కొబ్బరి నూనెతో పాలిష్ చేస్తాము "అని మరియా చెప్పింది. ఆర్డర్లు డెలివరీ అయిన తర్వాత, ఆమె అందుకున్న ఫీడ్‌బ్యాక్ చాలా పాజిటివ్‌గా వచ్చింది.

నాలుగు సైజుల గిన్నెలు సలాడ్‌లను అందించడానికి ఉపయోగించబడుతుంది. ఇంకా టీకప్‌లు, కొవ్వొత్తులు, కత్తిపీటలు, మొక్కలు వేసుకునే పాట్‌లను తయారు చేస్తోంది.

"ఈ కోకోనట్ షెల్ బౌల్స్‌ను సూప్‌లు లేదా స్మూతీస్ వంటి చల్లని ఆహారం కోసం ఉపయోగించవచ్చు. ఇప్పటి వరకు దాదాపు 8,000 ఉత్పత్తులను విక్రయించింది. తమిళనాడు, కర్ణాటక, కేరళ నుండి ఆర్డర్‌లను అందుకుంటోంది.

"కొన్ని నెలల్లో, ఉత్పత్తులు అమెజాన్ ద్వారా జర్మనీలో కూడా విడుదల చేయబడతాయి" అని మరియా చెప్పింది.

Next Story