మహీంద్రా కంపెనీకి బంపర్ ఆఫర్.. ఏంటో తెలుసా!

X
ఆత్మ నిర్భర్ భారత్ దేశీయ కంపెనీలకు భాగా కలిసివస్తోంది. తాజాగా మహీంద్రా కంపెనీకి మరో బంపర్ ఆఫర్ తగిలింది.. రక్షణ శాఖ తాజాగా మహీంద్రా డిఫెన్స్ సిస్టమ్స్ లిమిటెడ్ కంపెనీతో కీలక ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా కంపెనీ 1300 లైట్ కంబాట్ వెహికిల్స్ ఉత్పత్తి చేసి సరఫరా చేయాల్సి ఉంటుంది. డీల్ వాల్యూ వచ్చేసి రూ.1056 కోట్లు. నాలుగేళ్లలో ఈ వాహనాలను ఆర్మీకి అందజేయాల్సి ఉంటుంది.
ఈ వాహనాలను సరిహద్దుల్లో వినియోగిస్తారు. మీడియం మిషన్ గన్స్, ఆటోమాటిక్ గ్రనేడ్ లాంచర్ లు యాంటీ ట్యాంక్ మిసైల్స్ మోసుకపోవడానికి వీటిని వినియోగిస్తారు. ఈ వాహనాలను పూర్తిగా దేశీయంగా డిజైన్ చేసి.. సరఫరా చేస్తారు.
ఇది వాహనాలు మన దేశీ సమర్ధతకు నిదర్శనంగా ఉండబోతున్నాయని ప్రభుత్వం ప్రకటించింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
