మిమ్మల్ని జైల్లో ఎందుకు పెట్టకూడదు? కిషోర్ ‌బియానీకి షాక్ ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు !

మిమ్మల్ని జైల్లో ఎందుకు పెట్టకూడదు? కిషోర్ ‌బియానీకి షాక్ ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు !
కిషోర్ బియానీని జైల్లో ఎందుకు వేయకూడదంటూ కూడా సీరియస్ కామెంట్లు చేయడంతో పరిస్థితి ఎంత తీవ్రంగా మారిందో అర్దం చేసుకోవచ్చు

రిలయన్స్ సంస్థతో ఏ రోజు ఫ్యూచర్ గ్రూప్ కిషోర్ బియానీ డీల్ సెట్ చేసుకున్నాడో కానీ, ఆ రోజు నుంచి స్టాక్స్‌ని కష్టాలు వెంటాడుతున్నట్లు కన్పిస్తోంది. ఆరంభంలో ఉవ్వెత్తున ఎగసినా, రోజులు గడిచే కొద్దీ రకరకాల మలుపులతో సంస్థలో వాటాలు కొనుక్కున్న రిటైల్ ఇన్వెస్టర్లు బేర్‌మంటున్నారు. తాజాగా ఢిల్లీ హైకోర్టు గతంలో ఇచ్చిన ఎమర్జెన్సీ రిలీఫ్ అవార్డ‌్‌ని వెనక్కి తీసుకోవడంతో ఫ్యూచర్ గ్రూప్‌లోని ప్రతి స్టాక్ డౌన్ సర్క్యూట్ పడింది. అంతేకాదు సంస్థ ప్రమోటర్ , ఫౌండర్ అయిన కిషోర్ బియానీని జైల్లో ఎందుకు వేయకూడదంటూ కూడా సీరియస్ కామెంట్లు చేయడంతో పరిస్థితి ఎంత తీవ్రంగా మారిందో అర్దం చేసుకోవచ్చు.

10శాతం పతనమైన షేర్లు :

ఫ్యూచర్ రిటైల్ - రూ.55.85

ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ ఫ్యాషన్స్- రూ.64.85

ఫ్యూచర్ కన్జ్యూమర్- రూ.6.42

5శాతం పతనమైన షేర్లు :

ఫ్యూచర్ సప్లై చైన్- రూ.79.80

ఫ్యూచర్ మార్కెట్ నెట్‌వర్క్స్- రూ.15.05

ఈ స్టాక్స్‌లో ఫ్యూచర్ రిటైల్ మరీ దారుణంగా రికార్డు స్థాయి పతనాన్ని నమోదు చేసింది. కోర్టు గతంలో ఇచ్చిన రిలీఫ్‌ని ఎఁదుకు వెనక్కి తీసుకుందంటే, ప్రమోటర్ కిషోర్ బియానీతో పాటు ఇతరులు ఎమర్జెన్సీ అవార్డు కింద ఇచ్చిన తీర్పుని ఉల్లంఘించడమే కారణం.అంతేకాదు, ఇలా తీర్పుని పక్కదారి పట్టించినందుకు జైల్లో ఎందుకు పెట్టకూడదంటూ కూడా సీరియస్ కామెంట్లు చేసింది. అంతేకాదు బియానీ అసెట్స్‌ని అటాచ్ చేయడంతో పాటు వాటి విలువను కూడా మదింపు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Also Read : Profit Your Trade

Tags

Read MoreRead Less
Next Story