భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు!

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు!
హెవీ వెయిట్‌ స్టాక్స్‌ భారీ కరెక్షన్‌కు గురికావడంతో దేశీయ మార్కెట్లను భారీ నష్టాలకు గురిచేసింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌తో పాటు, ఎల్ ‌అండ్ ‌టీ, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌లు భారీ కరెక్షన్‌కు గురయ్యాయి.

దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. కోవిడ్‌-19 భయాలతో దేశ సరిహద్దులను యూకే మూసివేయడం, ప్రపంచ దేశాల్లోనూ కరోనా వైరస్‌ విజృంభిస్తోందన్న వార్తలతో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా అమ్మకాలకు దిగారు. దీంతోపాటు ఇన్వెస్టర్లు హైయర్‌ లెవల్స్‌లో లాభాలకు మొగ్గుచూపడం కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. గత కొన్ని రోజులుగా దేశీయ మార్కెట్లో భారీగా ఇన్వెస్ట్‌ చేస్తోన్న ఎఫ్‌ఐఐలు, ఫండ్‌ హౌజ్‌లు కూడా పెట్టుబడులను వెనక్కి తీసుకోవడంతో మార్కెట్లు భారీగా నష్టపోయాయి.

హెవీ వెయిట్‌ స్టాక్స్‌ భారీ కరెక్షన్‌కు గురికావడంతో దేశీయ మార్కెట్లను భారీ నష్టాలకు గురిచేసింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌తో పాటు, ఎల్ ‌అండ్ ‌టీ, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌లు భారీ కరెక్షన్‌కు గురయ్యాయి. అలాగే ఏవియేషన్‌ స్టాక్స్‌లోనూ భారీ ఒత్తిడి కనిపించింది. డిసెంబర్‌ 31వరకు యూకేకు విమాన సర్వీసులను భారత్‌ నిలిపివేయడంతో ఇంటర్‌ గ్లోబల్‌ ఏవియేషన్‌, స్పెస్‌జెట్‌ తదితర స్టాక్స్‌ 10శాతం నష్టపోయాయి.

గ్లోబల్‌ మార్కెట్ల సపోర్ట్‌ లేకపోవడంతో ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 45వేల దిగువకు పడిపోయింది. ఒకదశలో సెన్సెక్స్‌ 2037 పాయింట్లు నష్టపోయి 44 వేల 923కు పడిపోయింది. నిఫ్టీ కూడా 600 పాయింట్లు నష్టపోయి డే కనిష్ట స్థాయి 13 వేల 131కు క్షీణంచింది. అయితే ట్రేడింగ్‌ చివర్లో లభించిన స్వల్ప కొనుగోళ్ళ మద్దతుతో మార్కెట్లు కోలుకున్నప్పటికీ భారీ నష్టాల నుంచి మాత్రం తప్పించుకోలేకపోయాయి. మొత్తం మీద సెన్సెక్స్‌ 1407పాయింట్ల నష్టంతో 45 వేల 554 వద్ద, నిఫ్టీ 432 పాయింట్ల నష్టంతో 13 వేల 328 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. ఓఎన్‌జీసీ, టాటా మోటార్స్‌, గెయిల్‌, ఐఓసీ, హిందాల్కోలు 7 నుంచి 9శాతం నష్టపోయాయి.

Tags

Read MoreRead Less
Next Story