Ducati Streetfighter V4 SP: భారత మార్కెట్లో డుకాటీ బైక్.. ధర, ఫీచర్లు చూస్తే..

Ducati Streetfighter V4 SP: బైక్స్ తయారీలో అగ్రగామిగా వెలుగొందుతున్న ఇటలీ నుంచి మరో కొత్త బైక్ మార్కెట్లోకి ప్రవేశించింది. భారత్‌లో స్ట్రీట్ ఫైటర్ వీ4 ఎస్‌పీ స్పోర్ట్స్ నేక్డ్ బైక్‌ను విడుదల చేసింది. ఈ బైక్ బుకింగ్‌లు, డెలివరీలను కూడా స్టార్ట్
చేసింది. ట్రాక్షన్ అండ్ వీల్ కంట్రోల్డ్‌తో పాటు పలు ఎలక్ట్రానిక్ రైడింగ్ ఎయిడ్స్‌తో వింటర్ టెస్ట్ లివరీ లుక్‌తో అద్భుతమైన డిజైన్‌తో దీన్ని లాంచ్ చేసింది. సరికొత్త స్ట్రీట్‌ఫైటర్ V4 SPతో స్ట్రీట్‌ఫైటర్ వాహనాన్ని భారతదేశంలో విస్తరింపజేస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము" అని డుకాటి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ బిపుల్ చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బైక్ 9,500
ఆర్‌పిఎమ్ వద్ద 123 ఎన్ఎమ్ టార్క్‌ను విడుదల చేస్తూ 208 హెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ధర ఎక్స్‌షోరూంలో రూ.34.99 లక్షలు. ఫీచర్ల విషయానికి వస్తే.. 1,103 సీసీ లిక్విడ్-కూల్డ్, డెస్మోసెడిసి స్ట్రాడేల్ ఇంజన్ ఇందులో అందిస్తోంది. సింగిల్ సీట్, కార్బన్ హీల్ గార్డ్స్‌తో అడ్జస్టబుబుల్ రైడర్ ఫుట్ పెగ్స్, 3 రైడింగ్
మోడ్స్, ఏబీఎస్ కార్నరింగ్ బాష్, ట్రాక్షన్ కంట్రోల్ ఈవో 2, స్లైడ్ కంట్రోల్, వీలీ కంట్రోల్, పవర్ లాంచ్, క్విక్ షిఫ్ట్ అప్/డౌన్ వంటి హంగులు ఉన్నాయి. బైక్ ప్రియులను బుకాటీ ఆకర్షిస్తున్నా ధర చూస్తే దడ పుట్టేలా ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com