Amit Agarwal: అమిత్ అగర్వాల్‌కు ఈడీ సమన్లు.. అమెజాన్ 'ఫ్యూచర్' ఎటు..?

X
Amit Agarwal (tv5news.in)
Amit Agarwal: అమెజాన్ ఇండియా సీఈవో అమిత్ అగర్వాల్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. అమెజాన్-ఫ్యూచర్ గ్రూప్ మధ్య జరిగిన ఒప్పందంపై సమన్లు ఇచ్చింది. 2019లో ఫ్యూచర్ రిటైల్ గ్రూప్‌లో 49 శాతం వాటాను అమెజాన్ 1400 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఈ డీల్ ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్‌మెంట్ చట్టాలకు విరుద్ధంగా ఉందని ఈడీ భావిస్తోంది. దీనిపై జనవరిలో అమెజాన్‌పై ఫేమా కేసు నమోదు కాగా.. ఇప్పుడు అమెజాన్ ఇండియా సీఈవో అమిత్ అగర్వాల్‌కు ఈడీ సమన్లు జారీచేసింది. దీనిపై స్పందించిన అమిత్ అగర్వాల్.. న్యాయనిపుణులతో చర్చించిన తర్వాత జవాబు ఇస్తామని చెప్పారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
