BYJU'S: సవాళ్ల సుడిగుండంలో బైజూస్..

BYJUS: సవాళ్ల సుడిగుండంలో బైజూస్..

కోవిడ్ విపత్తు సమయంలో టెక్నాలజీ సాయంతో దేశంలో నూతన విద్య అభ్యసనా మార్గంతో, అనతికాలంలోనే అపార వృద్ధితోఎదిగి సంచలనం సృష్టించిన ప్రసిద్ధ ఎడ్యుటెక్ కంపెనీ బైజూస్. కంపెనీ స్థాపించిన కొద్ది రోజుల్లోనే పెట్టుబడిదారులను ఆకర్షించి యూనికార్న్ క్లబ్‌లో చేరింది. అయితే ప్రస్తుతం పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. కంపెనీ ఎంపిక చేసిన ఉద్యోగులకు జాయినింగ్ లెటర్లు, ఆఫర్ లెటర్లను వాయిదా వేసింది. ఆఫర్ లెటర్లు ఉన్న వారికి జాయినింగ్ తేదీలని కొన్ని నెలల పాటు వాయిదా వేసింది.

ఒక ఇంజనీరింగ్ అభ్యర్థికి రూ.22 లక్షల వార్షిక వేతనం కంపెనీ ప్రకటించింది. అయితే కంపెనీ జాయినింగ్ తేదీని పలుమార్లు వాయిదా వేశారన్నారు. మొదట ఆగస్టుకి వాయిదా వేసి, ఇప్పుడు వచ్చే సంవత్సరం జనవరికి వాయిదా వేశారని నిరాశ వ్యక్తం చేశాడు. అసలు కంపెనీలో జాయిన్‌ అవుతానో లేదో అని అశక్తత వ్యక్తం చేశాడు. ప్రొడక్ట్ విభాగంలో జాయిన్ అవ్వాల్సిన మరో వ్యక్తి కూడా ఇదే రకమైన ఈమెయిల్స్‌ వస్తున్నాయని తెలిపాడు.


కంపెనీ ప్రతినిధులు మాత్రం ఈ పరిణామాలు దశల వారీగా నియామకాలు చేపట్టాలన్న వ్యూహాల్లో భాగమేనని తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులు, భవిష్యత్ ప్రాజెక్టుల ప్రాధాన్యతలకు అనుగుణంగా నియామకాలు జరుపుతామని తెలిపారు. ఈ వివరణలు ఉద్యోగులకు కొంతమేర స్వాంతన కలిగించనున్నాయి.

ఇటీవలె కంపెనీలోని బోర్డు డైరెక్టర్లు, ఉన్నత స్థాయి ఉద్యోగులు తమ పదవులకు రాజీనామా చేయడంతో డైరెక్టర్ల బోర్డ్ సగం ఖాళీ అయింది. కంపెనీ ఆడిటర్ పదవి నుంచి డెలాయిట్ సంస్థ తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో కంపెనీ భవిష్యత్ నియామకాలపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి.

ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాల్సిన ప్రావిడెంట్ ఫండ్ నిధులను జమ చేయడం లేదన్న ఆరోపణలున్నాయి. EPFO దీనిపై విచారణ ప్రారంభించింది. ఈ పరిణామాల నేపథ్యంలో కంపెనీ పాలనలో స్థిరత్వం, ఉద్యోగాల భర్తీపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

ప్రపంచంలోని పలు దేశాలు మాంద్యంలో జారుకున్న ఈ తరుణంలో టెక్నాలజీ, టెక్నాలజీ సంబంధిత కంపెనీల్లో ఉద్యోగుల కోతల నేపథ్యంలో ఉద్యోగుల్లో గుబులు రేగుతోంది. ఇటువంటి జాబ్ మార్కెట్‌లో వేరే కంపెనీల నుంచి ఆపర్లు రావోనన్న అందోళన ఉద్యోగుల్లో ఉంది.

Tags

Next Story