Elon Musk : ట్విట్టర్ లో మరో మార్పు

వ్యాపార ప్రకటనలు లేని 'ట్విట్టర్ వెర్షన్' ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు ఎలన్ మస్క్. ట్విట్టర్ ను కొనుగోలు చేసినప్పటి నుంచి మార్పులు చేస్తున్నారు మస్క్. తాజాగా వ్యాపార ప్రకటనలు లేని ట్విట్టర్ వెర్షన్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. "ట్విట్టర్ లో బిజినెస్ యాడ్స్ తరచుగా వస్తున్నాయి. అవి పెద్దగానూ ఉంటున్నాయి. మరో రెండు వారాల్లో వీటిని పరిష్కరించనున్నాం. యాడ్స్ లేకుండా అత్యధిక ధరతో కూడిన సబ్ స్క్రిప్షన్ ఉండనుంది" అని ట్వీట్ చేశారు మస్క్.
ట్విట్టర్ ను మస్క్ కొనుగోలు చేసినప్పటి నుంచి ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆ సంస్థను ఆర్థికంగా కుదేలు చేశాయి. ట్విట్టర్ బ్లూ, పెయిడ్ సబ్ స్క్రిప్షన్ వంటి మార్పుల వలన పలు అంతర్జాతీయ కంపెనీలు యాడ్స్ ఇవ్వడానికి వెనకడుగు వేశాయి. సుమారు 500 కంపెనీలు ట్విట్టర్ కు యాడ్స్ ను నిలిపివేశాయి. అమెరికాలోని ట్విట్టర్ ఆఫీస్ అద్దెకూడా బకాయి పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం కోర్టులో ఉంది. ఎలాగైనా ఆదాయాన్ని పెంచుకోవాలని చూస్తున్న ఎలన్ మస్క్, అత్యధిక ధరతో కూడా 'నో యాడ్స్' ట్విట్టర్ వెర్షన్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com