Twitter: బాసు మారాడు.. రూల్స్ మార్చేశాడు

Twitter: బాసు మారాడు.. రూల్స్ మార్చేశాడు
Twitter: ట్విట్టర్‌ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేసినప్పటి నుంచి కంపెనీలో ఉద్యోగుల కోతపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Twitter: ట్విట్టర్‌ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేసినప్పటి నుంచి కంపెనీలో ఉద్యోగుల కోతపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఖర్చు తగ్గించుకునేందుకు సగం మంది ఉద్యోగులను తొలగించే యోచనలో ఉన్నారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ ప్రక్రియ శుక్రవారం నుంచే మొదలవనుందని తెలిపింది.


ఆఫీసులో ఉన్నా.. లేక ఆఫీసుకు బయల్ధేరినా దయచేసి ఇంటికి వెళ్లండి అని ఉద్యోగులకు గురువారం మెయిల్ పెట్టినట్లు పేర్కొంది.

కంపెనీని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లేందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకోక తప్పట్లేదు అని ఉద్యోగులకు మెయిల్‌లో వెల్లడించింది.

విధుల నుంచి తొలగించిన ఉద్యోగులకు రెండు నెలల జీతంతో పాటు వారి ఈక్విటీలకు సమానమైన నగదును మూడు నెలల్లోగా చెల్లించనున్నట్లు తెలుస్తోంది. విధుల్లో కొనసాగే సిబ్బందికి వారి వర్క్‌కి సంబంధించి మెయిల్ ద్వారా సమాచారం అందిస్తామని తెలిపింది.


ఇప్పటి వరకు దాదాపు 3700 మందిని విధుల నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఖర్చులను ఏడాదికి ఒక బిలియన్ డాలర్ల వరకు తగ్గించుకోవాలని ట్విట్టర్ టీమ్‌కు మస్క్ సూచించినట్లు సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story