బంపరాఫర్ ప్రకటించిన రిచెస్ట్ మ్యాన్.. మీరు రెడీనా!

విద్యుత్ కార్ల కంపెనీ టెస్లా, ప్రైవేటు అంతరిక్ష కంపెనీ స్పేస్ ఎక్స్ అధినేత బిలియనీర్ ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. కాలుష్యానికి కారణమయ్యే కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను గ్రహించే బెస్ట్ టెక్నాలజీ డెవలప్ చేసిన వాళ్లకు 100 మిలియన్ డాలర్లు ప్రైజ్ మనీగా ఇస్తామని ప్రకటించారు.
ట్విట్టర్ వేదికగా ఈ ఆఫర్ ప్రకటించారు. ఈ విషయంలో ఇప్పటి వరకు ఉన్న సాంకేతికత పురోగతి చాలా తక్కువ. గాలి నుంచి కార్బన్‌ను బయటకు తీయడం కంటే ఉద్గారాలను తగ్గించడంపైనే ఇప్పుడు దృష్టి సారిస్తున్నారు.
అత్యుత్తమ కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీ అభివృద్ధి కోసం 100 మిలియన్ డాలర్లు విరాళంగా ఇవ్వాలనుకుంటున్నా.. అని ట్వీట్ చేసిన మస్క్.. మరో ట్వీట్‌లో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేస్తానని పేర్కొన్నాడు.
Am donating $100M towards a prize for best carbon capture technology
— Elon Musk (@elonmusk) January 21, 2021
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com