Elon Musk on Parag Agarwal: పరాగ్ అగర్వాల్‌పై ఎలాన్ మాస్క్ ట్వీట్ వైరల్.. ఇండియన్ టాలెంట్ అంటూ..

Elon Musk on Parag Agarwal: పరాగ్ అగర్వాల్.. టెక్ వరల్డ్‌లో ప్రస్తుతం ఈ పేరు మోతమోగిపోతోంది. ఇప్పటికే టెక్ దిగ్గజాలుగా ఉన్న సంస్థల్లో చాలావాటికి ఇండియన్స్ సీఈఓలుగా ఉండడం.. ఆ జాబితాలోకి పరాగ్ చేరడంతో ఇప్పుడు అందరు తన గురించే మాట్లాడుకుంటున్నారు. ఎంతోమంది ఇండియన్, అమెరికన్ ప్రముఖులు తనకు కంగ్రాట్స్ కూడా చెప్తున్నారు. తాజాగా ఓ అంతర్జాతీయ సెలబ్రిటీ కూడా పరాగ్ గురించి ట్వీట్ చేశారు.
ఎలాన్ మాస్క్.. తన ఇంటెలిజన్స్‌తో, టాలెంట్‌తో కొత్త ప్రపంచాన్నే సృష్టించగల వ్యక్తి. ఎలాన్ ఎప్పుడూ ఏదో ఒక ప్రయోగం చేస్తూ ప్రజలను ఆశ్చర్యపరుస్తూనే ఉంటాడు. ఏమీ లేని స్థాయి నుండి వచ్చిన ఎలాన్ మాస్క్.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద శాస్త్రవేత్తల పక్కన కూర్చొని తన ఐడియాలను డిస్కస్ చేసే వరకు వెళ్లాడు. తాజాగా ఈయన ట్విటర్ సీఈఓగా నియామకం అవుతున్న పరాగ్ అగర్వాల్‌పై వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
దాదాపు టెక్ దిగ్గజాల సంస్థలకు ఇండియన్సే సీఈఓలుగా ఉండడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇదే విషయాన్ని హైలైట్ చేస్తూ.. ఎలాన్ మాస్క్.. 'అమెరికా.. ఇండియన్స్ టాలెంట్‌తో చాలా లాభపడుతోంది' అంటూ ట్వీట్ చేశారు. దీనిని పాట్రిక్ కాలిన్సన్ అనే మరో వ్యాపారవేత్త కూడా సమర్ధించారు. అమెరికా వలసదారులకు ఛాన్స్ ఇవ్వడం మంచి విషయమని చెప్పుకొచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com